Begin typing your search above and press return to search.

వాళ్లింట‌ అతిధ్యం ఆశ్చ‌ర్య‌పోయిన స్టార్ కిడ్!

అంబానీ ఇంట పెళ్లి ముందొస్తు వేడుక‌లు ఏ రేంజ్ లో జ‌రుగుతున్నాయో తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Jun 2024 12:30 PM GMT
వాళ్లింట‌ అతిధ్యం ఆశ్చ‌ర్య‌పోయిన స్టార్ కిడ్!
X

అంబానీ ఇంట పెళ్లి ముందొస్తు వేడుక‌లు ఏ రేంజ్ లో జ‌రుగుతున్నాయో తెలిసిందే. పెళ్లి కి నెల‌లు స‌మ‌యం ఉండ‌గానే ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు అంబ‌రాన్నింటుతున్నాయి. మొన్న జామ్ న‌గ‌ర్ కి ప్ర‌పంచ దిగ్గ‌జాలే దిగొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు బిజినెస్ టైకూన్లు..మ‌రోవైపు సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో ఆవేడుక ఎంతో వైభ‌వంగా జ‌రిగింది. ఆ వేడుక చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోలేదంటే అతిశ‌యోక్తి కాదు.


వీడియోలు, ఫోటోలు చూసిన వారి ప‌రిస్థితే ఇలా ఉంటే? లైవ్ లో వీక్షించిన వారి ఇంకెంత అనుభూతికి లోనై ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న కూడా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. కానీ వాళ్ల‌లో ఎవ‌రూ కూడా ఆవేడుక గురించి ఎక్క‌డా చెప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ యువ న‌టి సారా అలీఖాన్ ఆ వేడుక‌ను ఎంతో గొప్ప‌గా వ‌ర్ణిస్తూ చెప్పుకొచ్చింది.

`అక్క‌డ బంగార‌మే వ‌డ్డించ‌న‌ట్లుగా అనిపించింది. ఎక్క‌డా చూసిన వ‌జ్రాల మ‌యం. ఖ‌రీదైన బంగారు నగ‌లే క‌నిపించాయి. ఒక్కో డిజైన్ ఒక్కో ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంది. అవి చూసి మాన‌వులు త‌యారు చేసినా డిజైన్లేనా అనిపించింది. పెళ్లి కోడుకు..పెళ్లి కుమార్తె ఒక ఎత్తైతే ఆకుటుంమంతా ముస్తాబైన విధానం మ‌రో ఎత్తు. స‌న్నిహితులు, స్నేహితులు ఎవ‌రికి వారు త‌మ స్థాయిని చూపించారు.

ఇక వేడుక‌కు విచ్చేసిన అతిధులంతా ఎంతో ప్ర‌త్యేకంగానూ ముస్తాబ‌య్యారు. ఎటు చూసిన ధ‌గ‌ధ‌గ‌లాగే. ఆ రాత్రి చూసి ప‌ట్ట‌ప‌గ‌లే అనిపించింది. అక్క‌డ అలంక‌ర‌ణ అంతా అందంగా ఉంది. అంబానీ ఫ్యామిలీ అంత ఉన్న‌త కుటుంబ‌మైనా ఎంతో నిరాడంబ‌ర అతిధ్యాన్ని మాకు అందించారు. అది చూసి వాళ్లు ధ‌రించిన బంగారం కంటే వాళ్ల మ‌న‌సులు ఇంకెంతో గొప్ప‌గా అనిపించాయి. ద‌గ్గ‌రుండి ప్ర‌తీ ఒక్క‌ర్ని ఎంతో బాగా చూసుకున్నారు. అనంత్ నాకు స్కూల్ మేట్. రాధిక కూడా చాలా కాలంగా తెలుసు. వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది` అని తెలిపింది.