పవన్ హీరోయిన్ ప్రతి మంగళవారం స్పెషల్ దర్శన్
ప్రస్తుతం ఓటీటీలు అవకాశాలు పెంచడంతో సారా ఇంకా నటిగా కెరీర్ రన్ కొనసాగిస్తోంది.
By: Tupaki Desk | 8 Aug 2024 2:30 AM GMTపవన్ కల్యాణ్ 'పంజా' చిత్రంలో నటించింది టాప్ మోడల్ సారా జేన్ డయాస్. సినిమా డిజాస్టరైంది. దీంతో డెబ్యూ నాయికల ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఈ సినిమాతోనే సారా జేన్ డయాస్ తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ బ్యూటీకి ఆరంగేట్రమే నిరాశ ఎదురైంది. పంజా ఫ్లాపైన తర్వాత సారా జేన్ తమిళ పరిశ్రమలోను అవకాశాల కోసం ప్రయత్నించింది. అక్కడ కొంతకాలం కెరీర్ బండిని నెట్టుకొచ్చినా ఆశించినంత రేంజుకు చేరుకోలేదు. అటుపై వెబ్ సిరీస్ లలోను నటించింది. ప్రస్తుతం ఓటీటీలు అవకాశాలు పెంచడంతో సారా ఇంకా నటిగా కెరీర్ రన్ కొనసాగిస్తోంది.
అయితే ఈ బ్యూటీకి మోడలింగ్ అసైన్ మెంట్స్ పరంగా కొరతేమీ లేదు. సోషల్ మీడియాల్లోను ప్రకటనలను పోస్ట్ చేస్తోంది. సారా రకరకాల ఆదాయ మార్గాలను అన్వేషించింది. ముఖ్యంగా సారా జేన్ ఇన్ స్టా మాధ్యమంగా వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా వైట్ అండ్ వైట్ డిజైనర్ లుక్ లో సంథింగ్ స్పెషల్ ఫోటోగ్రాఫ్స్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇవన్నీ యువతరంలో వైరల్ గా మారుతున్నాయి. వీటికి సారా జేన్ స్పైసీ వ్యాఖ్యను జోడించింది.
మంగళవారం మేం సె*గా దుస్తులు ధరిస్తాం. ఈ దుస్తులు @ferraznicole ఏమిటి?!? ధన్యవాదాలు!!! అంటూ క్యాప్షన్ ఇచ్చింది సారా. ఈ ప్రత్యేకమైన దుస్తులకు మీరు చాలా న్యాయం చేస్తున్నారు అంటూ అభిమానులు తనకు మద్ధతు పలికారు. పవన్ కల్యాణ్ హీరోయిన్ ప్రతి మంగళవారం స్పెషల్ దర్శన్ ఇస్తోందంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే... 2023లో మేడ్ ఇన్ హెవెన్, ఫ్రీల్యాన్సర్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించిన సారా తిరిగి పెద్ద తెరపైనా అవకాశాలు అందుకోవాలని తపిస్తోంది. ఒక పెద్ద ప్రకటనతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనేది ఆలోచన. కానీ ఆ ఒక్క ఛాన్స్ రావాల్సి ఉంది.