Begin typing your search above and press return to search.

పంజా బ్యూటీ విస్కీ పార్టీ?

తాజాగా పాపుల‌ర్ విస్కీ బ్రాండ్ ని ప్ర‌మోట్ చేసింది ఈ బ్యూటీ. ఇన్ స్టా వేదిక‌గా గ్లాసులో ఒంపిన విస్కీని వీక్ష‌కుల కోసం ప్ర‌ద‌ర్శించిన సారా ముంబై 4 సీజ‌న్స్ హోట‌ల్లో ఉన్న‌ప్ప‌టి ఫోటోల‌ను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   7 July 2024 5:08 AM GMT
పంజా బ్యూటీ విస్కీ పార్టీ?
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న పంజా చిత్రంలో న‌టించింది సారా జేన్ డ‌యాస్. అప్ప‌టికి టాప్ మోడ‌ల్ గా సుప‌రిచితురాలైన ఈ బ్యూటీ న‌ట‌నా కెరీర్ ప‌రంగా బిగ్ డ్రీమ్స్ తో ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ పంజా చిత్రం డిజాస్ట‌ర‌వ్వ‌డంతో అటుపై సారాకు అంత‌గా అవ‌కాశాలు ద‌క్క‌లేదు. తెలుగు, త‌మిళం స‌హా ప‌లు భాష‌ల్లో న‌టించినా ఎక్క‌డా స‌రైన బ్రేక్ రాలేదు.

ఇంత‌లోనే సారా జేన్ ల‌వ్ లో ప‌డిందంటూ పుకార్లు షికార్ చేసాయి. ఇటీవ‌ల వెబ్ సిరీస్ ల‌లో స‌క్సెస్ ని చ‌విచూశాక కొంత ఎమోష‌న‌ల్ అయిన సారా జేన్ ల‌వ్ లైఫ్ లో ఒడిదుడుకుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం గురించి మాట్లాడింది... ఇటీవ‌ల‌ వ‌రుస‌గా సోష‌ల్ మీడియాల్లో ప్ర‌క‌ట‌న‌లు పోస్ట్ చేస్తూ రెవెన్యూని పెంచుకుంది. తాజాగా పాపుల‌ర్ విస్కీ బ్రాండ్ ని ప్ర‌మోట్ చేసింది ఈ బ్యూటీ. ఇన్ స్టా వేదిక‌గా గ్లాసులో ఒంపిన విస్కీని వీక్ష‌కుల కోసం ప్ర‌ద‌ర్శించిన సారా ముంబై 4 సీజ‌న్స్ హోట‌ల్లో ఉన్న‌ప్ప‌టి ఫోటోల‌ను షేర్ చేసింది. స‌న్ టోరి విస్కీ అంటూ బ్రాండ్ పేరును కూడా ట్యాగ్స్ లో జోడించింది. ఓవ‌రాల్ గా పార్టీ నైట్ సారా జేన్ ఫుల్ గా ఎంజాయ్ చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. విస్కీ, హిబికి, జ‌పాన్, స‌న్ టోరి.. ఇవ‌న్నీ స‌రైన ప‌దాలు! అంటూ పాఠ‌కులు నేర్పే ప్ర‌య‌త్నం చేసింది సారా జేన్. విస్కీ గురించి చాలా బాగా చెప్పారు మ్యాడ‌మ్ అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో స్పందిస్తున్నారు.

డిప్రెష‌న్ నుంచి బ‌య‌టికి..

సారా జేన్ డయాస్ గ‌తంలో ఆందోళన, నిరాశతో పోరాడటం గురించి ఇక వెబ్ పోర్ట‌ల్ తో బహిరంగంగా మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంలో ఉత్థాన‌ప‌త‌నాల గురించి కూడా ఓపెన్ గానే చ‌ర్చించింది. ఈ బ్యూటీ తన ల‌వ్ లైఫ్ గురించి మాత్రం ఏనాడూ బ‌య‌ట‌ప‌డ‌లేదు. కానీ ఒక జాతీయ మీడియా పోర్టల్ కి అస‌లు విష‌యం చెప్పింది. త‌న డేటింగ్ గురించి ఆ ఇంట‌ర్వ్యూలో ఓపెనైంది.

''నేను ఒక‌ వ్యక్తితో చాలా కాలంగా సంబంధంలో ఉన్నాను. మేము చాలా కాలం పాటు కలిసి ఉన్నందున కుటుంబాలకు ఈ విష‌యం తెలుసు. కానీ మా మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ‌లున్నాయి'' అని సారా జేన్ వెల్ల‌డించింది. బంధాన్ని నిలుపుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని కూడా గ‌త ఇంట‌ర్వ్యూలో అన్నారు. రిలేష‌న్ షిప్‌లో రాజీ అవ‌స‌రం గురించి మాట్లాడిన సారా..''రాజీ అనేది సంబంధంలో ఒక భాగం. ఇద్దరు వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యులు, లేదా సహచరులతో అయినా కానీ.. శృంగార సంబంధంలో ఎల్లప్పుడూ ఇవ్వడం తీసుకోవడం అనే అంశం ఉంటుంది. నేను నాకే మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఎవ‌రైనా అర్థం చేసుకోవ‌డం ముఖ్యం'' అని అన్నారు.

తాండవ్, యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ వంటి సిరీస్ ల‌తో కొంత‌వ‌ర‌కూ పేరు తెచ్చుకున్న సారా..త‌న వ్య‌క్తిగ‌త జీవితం డేటింగ్ గురించి బ‌హిరంగంగా చర్చించారు. సంబంధంలో గొడ‌వ‌లు, రాజీ ప‌డ‌టాలు చాలా కామ‌న్ అని కూడా అన్నారు. ఇక సారా జేన్ న‌టించి 'మేడ్ ఇన్ హెవెన్' రెండవ సీజన్‌లో త‌ను నటించిన ఎపిసోడ్ కూడా స్వీయ-ప్రేమ స్వీయ-సంరక్షణకు సంబంధించినది. తాను ఆ పాత్రకు కనెక్ట్ అవ్వడానికి తాను న‌మ్మిన వ్య‌వ‌స్థ సహాయపడింది. ఇందులో వేలం వేసిన తర్వాత బలిపీఠం వద్ద తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది! నేను ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను..గత రెండు సంవత్సరాలలో నేను ఎలాంటి కష్ట సమయాలను ఎదుర్కొన్నాను... ఈ వెబ్ సిరీస్ అవ‌కాశం సరైన సమయంలో వచ్చింది. దాని విజయం నాకు అద్భుతంగా ఉంది. ఇది నా కుటుంబం సహా న‌న్ను చాలా భావోద్వేగానికి గురిచేసింది అని కూడా ఆ స‌మ‌యంలో వ్యాఖ్యానించింది.