సారంగపాణి జాతకం.. జెట్ స్పీడ్ లో మరో కామెడీ మూవీ ఫినిష్
టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా శ్రీదేవి మూవీస్ గుర్తింపు పొందింది.
By: Tupaki Desk | 9 Sep 2024 5:56 AM GMTటాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా శ్రీదేవి మూవీస్ గుర్తింపు పొందింది. ఈ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలని ప్రేక్షకులకి అందించారు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా సారంగపాణి జాతకం అనే టైటిల్ తో మూవీ తెరకెక్కింది.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇంద్రగంటి మోహన కృష్ణ శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో ఇది వరకు జెంటిల్మన్, సమ్మోహనం సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు మూడో చిత్రంగా సారంగపాణి జాతకం తెరకెక్కింది. ఐదు షెడ్యూల్స్ లో జెట్ స్పీడ్ లో మూవీ షూటింగ్ మొత్తం ఫినిష్ చేసారంట.
మూవీ చివరి రోజు షూటింగ్ కంప్లీట్ చేసి చిత్ర యూనిట్ అందరూ కలిసి దిగిన ఫోటోతో పోస్టర్ రిలీజ్ చేశారు. రూప కొడవయూర్ ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా నటించింది. శ్రీదేవి మూవీస్ లో వచ్చిన చిన్నోడు పెద్దోడు, ఆదిత్య369 సినిమాలకి లెజెండరీ రైటర్, డైరెక్టర్ జంధ్యాల డైలాగ్స్ రాశారు. టాలీవుడ్ లో కామెడీ చిత్రాలు అంటే జంధ్యాల గుర్తుకొస్తారు. అలాంటి ఆహ్లాదకరమైన కామెడీతో జంధ్యాలని రీప్లేస్ దర్శకులు ఇప్పటి వరకు టాలీవుడ్ కి రాలేదు.
కానీ ఇంద్రగంటి మోహనకృష్ణ జంధ్యాల సినిమాల తరహాలో ఆహ్లాదకరమైన వినోదంతో కొన్ని మూవీస్ చేసి సక్సెస్ లు అందుకున్నారు. అష్టా చెమ్మా, అమీ తుమీ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమాలు తీయడంలో మోహనకృష్ణ శైలి డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే శ్రీదేవి మూవీస్ కూడా అదే తరహాలో సినిమాలు నిర్మిస్తు మంచి గుర్తింపు అందుకుంది.
జంధ్యాల తరహా కామెడీతో మూవీ చేయాలనే తన తపనని సారంగపాణి జాతకం తీర్చిందని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు. సెప్టెంబర్ 12 నుంచి ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయని తెలిపారు. మూవీని హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఐదు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేసినట్లు నిర్మాత స్పష్టం చేశారు.
త్వరలో రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్. సారంగపాణి జాతకం సినిమాలో వెన్నెల కిషోర్, నరేష్, వైవా హర్ష లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. పీజీ వింద సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ గా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు.