Begin typing your search above and press return to search.

ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' - పర్ఫెక్ట్ సమ్మర్ డేట్!

టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ సారంగపాణి జాతకం విడుదల తేదీ ఖరారైంది.

By:  Tupaki Desk   |   17 March 2025 4:45 PM IST
ప్రియదర్శి సారంగపాణి జాతకం - పర్ఫెక్ట్ సమ్మర్ డేట్!
X

టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ సారంగపాణి జాతకం విడుదల తేదీ ఖరారైంది. టాలెంటెడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందింది. గతంలో జెంటిల్‌మన్, సమ్మోహనం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.


ఇక సినిమా విడుదలపై చాలా రోజులుగా అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఎట్టకేలకు మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 18న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలు మినహా అన్నీ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి.

ఇటీవల విడుదలైన కోర్ట్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ విజయాన్ని అందుకున్న ప్రియదర్శి, ఈసారి సారంగపాణి జాతకం ద్వారా ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తాలని చూస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పూర్తయింది. వివేక్ సాగర్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. రెండు పాటలు ఇప్పటికే విడుదల కాగా, మిగిలిన ట్రాక్‌లు కూడా మంచి స్పందన అందుకునే అవకాశముంది.

సారంగపాణి జాతకం సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మంచి కామెడీ హంగులు పుష్కలంగా ఉన్నాయని నిర్మాత కృష్ణప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను మలిచారని, ఇప్పటివరకు వచ్చిన ప్రోమోలకు సానుకూల స్పందన రావడంతో సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

వెన్నెల కిశోర్, వీకే నరేష్, వైవా హర్షా డిఫరెంట్ కామెడీ రోల్స్ లో కనిపించనున్నారు. తణికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, శివన్నారాయణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ రూపా కొడువయూర్ హీరోయిన్‌గా నటించగా, పీజీ విందా సినిమాటోగ్రఫీ, రవీందర్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాలను అందించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ తొలి వారంలో విడుదల కానుంది. వేసవి సీజన్‌లో కుటుంబ ప్రేక్షకులకు సరైన ఎంటర్టైన్మెంట్ అందించడానికి సారంగపాణి జాతకం సిద్ధంగా ఉంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.