Begin typing your search above and press return to search.

సారంగపాణి జాత‌కం: పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సారంగపాణి జాత‌కం’ లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 5:01 AM GMT
సారంగపాణి జాత‌కం: పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సారంగపాణి జాత‌కం’ లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. క్రిస్మస్ హాలిడే సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ఈ డేట్ ఫిక్స్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా క్రిస్మస్ కి విడుదల కాకపోవడంతో 'సారంగపాణి జాత‌కం' ఈ స్లాట్ ని దక్కించుకుంది.

ప్రస్తుతం డబ్బింగ్ వర్క్‌లు చివరి దశకు చేరుకున్నాయని, ఫస్ట్ కాపీ కూడా త్వరలో సిద్ధం కానుందని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి, క్రిస్మస్ సెలవుల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము.. అని ఆయన తెలిపారు.

వెన్నెల కిషోర్, వి.కె. నరేశ్, వైవా హర్షా ప్రధానమైన హాస్యనటులుగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, శివన్నారాయణ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ అందమైన, అర్ధవంతమైన కామెడీతో కూడిన చిత్రంలో ప్రేక్షకులకి ఇష్టమైన థీమ్‌లను జోడించారు.

తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విదంగా ఉండనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' ఫేమ్ రూపా కొడువాయూర్ కథానాయికగా నటిస్తున్నారు. కామెడీ చిత్రాలకు ప్రసిద్ధులైన వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. పి.జి. విన్దా సినిమాటోగ్రఫీని, రవీందర్ ప్రొడక్షన్ డిజైన్ ని అందించారు.