Begin typing your search above and press return to search.

సారంగపాణి జాతకం.. ఎప్పుడైనా పేలొచ్చు?

అయితే సారంగపాణి జాతకం సినిమాను డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 7:30 PM GMT
సారంగపాణి జాతకం.. ఎప్పుడైనా పేలొచ్చు?
X

టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న మరో మూవీ సారంగపాణి జాతకం. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా శివలింగ కృష్ణ ప్రసాద్ రూపొందిస్తున్న ఆ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. మోహనకృష్ణ, శివలింగ కృష్ణ ప్రసాద్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రానున్న మూడో సినిమా ఇదే కావడం విశేషం.

గతంలో వారిద్దరూ కలిసి జెంటిల్‌ మెన్, సమ్మోహనం సినిమాలకు గాను వర్క్ చేశారు. ఆ రెండు మంచి హిట్స్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ సారంగపాణి జాతకం చిత్రం కోసం చేతులు కలిపారు. దీంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా.. రూప కొడువాయూర్ హీరోయిన్‌ గా యాక్ట్ చేస్తున్నారు.

అయితే సారంగపాణి జాతకం సినిమాను డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. కొద్ది రోజుల క్రితం టీజర్ ను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ కడుపుబ్బా నవ్విస్తూ అలరించింది. సినిమాపై అంచనాలు పెంచింది.

టీజర్ ప్రకారం.. సినిమాలో హీరో జాతకాలు బాగా నమ్ముతాడు. మరి ఆ జాతకాలపై ఎక్కువ నమ్మకం వల్ల హీరో లైఫ్ లో ఏం జరుగుతుంది? ఎలాంటి మార్పులు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? కీచకుడి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? వంటి ప్రశ్నలకు సమాధానాలే సినిమాగా తెలుస్తోంది.

అయితే ఇప్పుడు సారంగపాణి జాతకం మూవీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. విడుదల వాయిదా పడే అవకాశం కనిపిస్తుందని అంటున్నారు. డిసెంబర్ 20వ తేదీన మాత్రం రిలీజ్ అవ్వదని చెబుతున్నారు. డిసెంబర్ 31వ తేదీన కానీ జనవరి మూడో వారంలో విడుదల చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

కొందరు సంక్రాంతికి రిలీజ్ అవుతుందేమోనని చెబుతున్నా.. అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ అప్పుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. సంక్రాంతికి పోటీ ఉన్నా.. సారంగపాణి జాతకం వంటి కామెడీ సినిమాలు క్లిక్ అయితే పెద్ద సినిమాలున్నా కూడా బాగా ఆడుతాయి. మరి సారంగపాణి జాతకం చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందో లేదో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.