Begin typing your search above and press return to search.

హీరోయిన్ రేంజ్ అందాలతో సారా టెండూల్కర్‌

తాజాగా మరోసారి సారా టెండూలర్క్‌ తన అందమైన ఫోటో షూట్ ను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 5:30 PM GMT
హీరోయిన్ రేంజ్ అందాలతో సారా టెండూల్కర్‌
X

క్రికెట్‌ అనగానే మనకు గుర్తుకు వచ్చే పేర్లలో సచిన్ టెండూల్కర్ పేరు ముందు ఉంటుంది. క్రికెట్‌ దేవుడు అంటూ సచిన్ టెండూల్కర్ కి పేరు. అంతటి సచిన్‌ వారసులు రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తున్నారు. సచిన్ తనయుడు క్రికెట్ తో అలరిస్తూ ఉంటే కూతురు సారా టెండూల్కర్‌ హీరోయిన్‌ రేంజ్ అందాలతో అలరిస్తూ ఉంటుంది.


రెగ్యులర్‌ గా సారా టెండూల్కర్‌ సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసి పోకుండా సారా టెండూల్కర్‌ అందం ఉంటుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో పలు సార్లు ఆమె షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలు చూసిన వారు హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వాలని కోరుకున్నారు.

తాజాగా మరోసారి సారా టెండూలర్క్‌ తన అందమైన ఫోటో షూట్ ను షేర్ చేసింది. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్స్ తో పోల్చితే సారా టెండూల్కర్ మరింత అందంగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. తన కూతురును సచిన్ ఎందుకు హీరోయిన్ గా పరిచయం చేయడం లేదని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఎల్లో డ్రెస్ లో సారా టెండూల్కర్‌ చిరు నవ్వులు చిందిస్తూ సూపర్‌ స్కిన్‌ టోన్ తో ఆకట్టుకుంది. ఇప్పట్లో కాకున్నా ముందు ముందు అయినా సారా టెండూల్కర్ ఖచ్చితంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనిపిస్తుంది. సారా హీరోయిన్ గా చేయకుంటే ఆమె అందం అంతా వృధా అన్నట్టు కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.