కుమార్తె మెడిసిన్ పూర్తి.. తండ్రిగా సచిన్ ఎమోషనల్
క్లినికల్ & పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో సారా టెండూల్కర్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. దీంతో కుమార్తె సారాను సచిన్ అభినందించారు.
By: Tupaki Desk | 25 May 2024 5:08 AM GMTసచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తెలివితేటలు అందచందాల గురించి ఇప్పుడే అభిమానులకు పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ కథానాయికలకు ధీటైన అందగత్తెగా గుర్తింపు ఉంది. ఈ బ్యూటీ ఇటీవల మోడలింగ్ లో రాణిస్తోంది. అలాగే యువక్రికెటర్ శుభ్‌మాన్ గిల్ తో ప్రేమలో ఉందన్న ప్రచారంతోను యువతరంలో సారా నిరంతరం చర్చల్లో నిలుస్తోంది.
ఇదిలా ఉండగానే ఇప్పుడు సారా టెండూల్కర్ సాధించిన ఘనత గురించి డిబేట్ మొదలైంది. క్లినికల్ & పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో సారా టెండూల్కర్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. దీంతో కుమార్తె సారాను సచిన్ అభినందించారు. ప్రశంసలతో పాటు ప్రేమను కురిపించాడు. 'ఇది అందమైన రోజు' అని ట్యాగ్ చేసారు. తల్లి అంజలితో కలిసి ఉన్న ఫోటోతో పాటు సారా కాన్వొకేషన్ వేడుక తాలూకా వీడియోను సచిన్ షేర్ చేసారు. ''ఇది ఒక అందమైన రోజు. UCL మెడిసిన్ డిపార్ట్‌మెంట్ నుండి క్లినికల్ & పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మా కుమార్తె తన మాస్టర్స్ డిస్టింక్షన్‌తో పూర్తి చేసిన రోజు. తల్లిదండ్రులుగా సంవత్సరాల తరబడి నీ శ్రమను చూసినందుకు ఈ క్షణం మేము చాలా గర్వపడుతున్నాము. ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాదు'' అని సచిన్ ఎమోషనల్ నోట్ రాసారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సోమవారం ముంబైలో కుమారుడు అర్జున్‌తో కలిసి సచిన్ ఓటు వేస్తూ కనిపించారు. ముఖ్యంగా టెండూల్కర్ ఎన్నికల ప్రక్రియలో ఓటరుకు అవగాహనను పెంచడానికి ఎన్నికల సంఘం (EC) ప్రచార కార్యక్రమాలకు సహకరించారు. సారా కాన్వకేషన్ సమయంలో ముంబైలో ఓటింగ్ చేయడం వల్ల సచిన్ లండన్‌లో జరిగిన వేడుకకు హాజరు కాలేదు. సచిన్ తనయుడు అర్జున్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుక కారణంగా సచిన్ భార్య అంజలి - కుమార్తె సారా ఓటు వేయడం కోసం ముంబైకి రాలేకపోయారు.