ఫోటో స్టోరి: సారా టెండూల్కర్ సీతా కోక రూపం
సారా ఈ కొత్త లుక్ కోసం తన మేకప్‌ను మినిమల్ గా ఉంచింది. డిజైనర్ దుస్తులను ఎలివేట్ చేసేలా మైక్రో టోన్‌లను ఎంచుకుంది.
By: Tupaki Desk | 1 Aug 2024 4:42 AM GMTసీతా కోక చిలుక రెక్కలు విప్పి ఆడుతోంది... అందమైన సారా టెండూల్కర్ లేటెస్ట్ పోటోషూట్ చూసాక అభిమానుల మనసులో ఫీలింగ్ ఇది. క్రికెట్ గాడ్ సచిన్ వారసురాలు ఎంత అందంగా కనిపిస్తోంది. సీతా కోక చిలుక అవతార్ లో హృదయాలను కొల్లగొడుతోంది. ఇప్పటికే సారా మోడల్ గా హృదయాలను గెలుచుకుంది. సినీనటి సారా అలీఖాన్ తో కలిసి స్పోర్ట్స్ స్టార్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఇంతకుముందు ఒక వాణిజ్య ప్రకటనలో నటించగా అది సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
సారా అందచందాలు.. యవ్వనం ఇప్పటికే కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీట్ గా మారింది. సారా ఒకవేళ బాలీవుడ్ లో ప్రవేశిస్తే పెద్ద కథానాయికగా ఎదగడం కష్టమేమీ కాదని అభిమానులు నమ్ముతున్నారు. కానీ ఇప్పటివరకూ దాని గురించి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడ లేదు. సారా టెండూల్కర్ ఇటీవల పూర్తిగా అకడెమిక్ స్టడీస్ పైనే దృష్టి సారించిందని తెలుస్తోంది.
ఈ లుక్ కి వేదిక ఎక్కడ? అంటే.. సారా టెండూల్కర్ ఇటీవల ఇండియన్ కోచర్ వీక్ 2024లో షో స్టాపర్ గా నిలిచింది. రాహుల్ మిశ్రా కలెక్షన్ షోకేస్‌కు హాజరైన సారా అద్భుతమైన బ్లాక్ ఐరిస్ డ్రెస్‌లో అబ్బురపరిచింది. ఒక ఫ్యాషన్ ఐకాన్‌గా సారా అంతకంతక ఎదుగుతోందనడానికి సూచిక ఇది. సీతాకోకచిలుక-కట్ , బాదం ఆకుల డీటెయిలింగ్ తో ఈ దుస్తులు చాలా ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.
ఈ ప్రత్యేక డిజైనర్ దుస్తులను గతంలో సెలీనా గోమెజ్, బానిటా సంధు, షెహ్నాజ్ గిల్ సహా పలువురు ప్రముఖులు ధరించి కనిపించారు. ఇప్పుడు సారా వంతు. సారా ఇటీవల ఫ్యాషన్ ఎంపికలు ప్రేక్షకులను గొప్పగా ఆకర్షిస్తున్నాయి. ఒక రకంగా కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈసారి `సీతాకోక టెండూల్కర్` రూపం మతి చెడగొడుతోంది! అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
సారా ఈ కొత్త లుక్ కోసం తన మేకప్‌ను మినిమల్ గా ఉంచింది. డిజైనర్ దుస్తులను ఎలివేట్ చేసేలా మైక్రో టోన్‌లను ఎంచుకుంది. ఈ ఎంపిక సెలబ్రిటీ ఫ్యాషన్‌లో మారుతున్న ట్రెండ్‌ను హైలైట్ చేస్తోంది. ఇక్కడ మేకప్ సహాయక పాత్రను పోషిస్తూ దుస్తుల ఆకర్షణను ప్రధానంగా హైలైట్ చేస్తోంది.