Begin typing your search above and press return to search.

హిట్‌ మూవీ సీక్వెల్ షురూ..!

తమిళ స్టార్ నటుడు కార్తీ కెరీర్ లో సర్దార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   25 Jun 2024 3:30 PM GMT
హిట్‌ మూవీ సీక్వెల్ షురూ..!
X

తమిళ స్టార్ నటుడు కార్తీ కెరీర్ లో సర్దార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఖైదీ తో పాటు సర్దార్‌ సినిమా కి సీక్వెల్‌ కావాలంటూ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

ఖైదీ 2 కి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ప్రకటించాడు. మరో వైపు సర్దార్ 2 కి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్శకుడు ప్రకటించాడు. పీఎస్ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన సర్దార్‌ సినిమా తెలుగు లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు సీక్వెల్‌ ను పాన్ ఇండియా రేంజ్ మూవీ అన్నట్లుగా రూపొందించేందుకు గాను దర్శకుడు పీఎస్ మిత్రన్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశాడు. తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు మూడు నెలల పాటు ఈ స్క్రిప్ట్‌ వర్క్ జరిగిందట.

కజకిస్తాన్‌, అజర్‌బైజాన్‌ తో పాటు జార్జియా ఇంకా పలు విదేశీ లొకేషన్స్ లో సర్దార్ 2 సినిమాను రూపొందించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సర్దార్‌ 2 స్క్రిప్ట్‌ రెడీ అయ్యిందని, అతి త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్ ప్రకటించారు.

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడని కూడా సమాచారం అందుతోంది. ఆషికా రంగనాథ్‌ ను హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. పీఎస్ మిత్రన్‌ ఇప్పటికే చెన్నై లో భారీ సెట్‌ నిర్మాణం చేస్తున్నాడు. జులై లో రెగ్యులర్ షూటింగ్‌ షురూ అవ్వబోతుంది.