Begin typing your search above and press return to search.

సెట్ లో ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన స్టంట్ మ్యాన్..!

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమిళంలో తెరకెక్కుతున్న ఒక సినిమా షూటింగ్ లో స్టంట్ మ్యాన్ ప్రమాదవశాత్తు మృతి చెందడం హాట్ న్యూస్ గా మారింది.

By:  Tupaki Desk   |   17 July 2024 7:21 AM GMT
సెట్ లో ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన స్టంట్ మ్యాన్..!
X

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమిళంలో తెరకెక్కుతున్న ఒక సినిమా షూటింగ్ లో స్టంట్ మ్యాన్ ప్రమాదవశాత్తు మృతి చెందడం హాట్ న్యూస్ గా మారింది. కార్తి హీరోగా పి.ఎస్ మిత్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్ధార్ 2 సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. ఈ షూటింగ్ లో ముందు యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఐతే ఈ సీన్స్ షూట్ చేస్తున్న టైం లో 20 అడుగుల ఎత్తు నుంచి స్టంట్ మ్యాన్ ఎజుమలై ప్రమాదవశాత్తు కింద పడగా అతను హాస్పిటల్ కి తీసుకెళ్తుండగానే మృతి చెందినట్టు తెలుస్తుంది.

సర్ధార్ 2 సినిమా చెన్నై ప్రసాద్ ల్యాబ్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాను ముందు భారీ యాక్షన్ సీన్ తో మొదలు పెట్టారు. ఐతే అంతా బాగానే జరుగుతుంది అనుకునే లోగా షూటింగ్ లో స్టంట్ మ్యాన్ మృతి చెందడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదివరకు కూడా ఇండియన్ 2 సినిమా టైం లో క్రేన్ యాక్సిడెంట్ వల్ల ఆ సినిమా సహాయక దర్శకులు ఇద్దరు మృతి చెందారు.

భారీ సినిమాలు చేస్తున్న టైం లో అందులోనూ యాక్షన్ సీన్స్ చేస్తున్న టైం లో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా సరే ఇలా ప్రాణాల మీదకు వస్తుంది. ఇండియన్ 2 సినిమా టైం లోనే అలా అసిస్టెంట్స్ మృతి వల్ల సినిమాను ఆపేశారు. సర్ధార్ 2 సినిమా టైం లో మళ్లీ అది రిపీట్ అయ్యింది. ఐతే ఈసారి 20 అడుగుల ఎత్తు నుంచి యాక్షన్ సీన్ కోసం ప్రయత్నించగా స్టంట్ మ్యాన్ మృతి చెదినట్టు తెలుస్తుంది.

ఐతే విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. సర్ధార్ తో సూపర్ హిట్ అందుకున్న కార్తి ఆ సినిమా సీక్వెల్ గా సర్దార్ 2 ని ప్లాన్ చేశారు. ఈ సీక్వెల్ ని మొదటి పార్ట్ కన్నా భారీగా ఉండాలని అనుకున్నారు. ఐతే ఈ ప్రమాదం వల్ల సర్దార్ 2 షూటింగ్ ఆగిపోయింది. ఐతే స్టంట్ మ్యాన్ మృతికి కారణాలు ఏంటి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా యాక్షన్ సీన్స్ చేశారా అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది.