Begin typing your search above and press return to search.

ఆర్జీవి 'శారీ' పబ్లిక్ టాక్ ఏంటి..?

ఇంతకీ శారీ కథ ఏటంటే.. ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న ఆరాధ్య దేవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

By:  Tupaki Desk   |   4 April 2025 1:23 PM
ఆర్జీవి శారీ పబ్లిక్ టాక్ ఏంటి..?
X

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి తన సమర్పణలో తెరకెక్కిన సినిమా శారీ. ఈ సినిమాను గిరి కృష్ణ కమల్ డైరెక్ట్ చేశారు. ఆరాధ్య దేవి, సత్య యాదు ప్రధాన పాత్రలుగా నటించిన ఈ శారీ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తను చేసే ఏ సినిమా అయినా సరే ప్రమోషన్స్ తో ప్రేక్షకులకు చేరేలా చేస్తాడు ఆర్జీవి. ఈ శారీ సినిమాను కూడా ఆరాధ్య దేవి ఫోటో షూట్స్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టాడు వర్మ. ఫైనల్ గా నేడు ఈ శారీని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.

ఇంతకీ శారీ కథ ఏటంటే.. ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న ఆరాధ్య దేవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమెను ఇష్ట పడే కిట్టు (సత్య యాదు) ఆమెకు దగ్గరవ్వాలని చూస్తాడు. ఐతే అతని వల్ల ఆమె ఇబ్బందుల్లో పడుతుంది. కిట్టు ఆరాధ్యని సీక్రెట్ గా ఫాలో అయ్యి ఆమె ఫోటోలు తీస్తాడు. అతను చెప్పినట్టు చేయకపోతే ఆమె కుటుంబాన్ని కూడా బెదిరిస్తుంటాడు. ఇంతకీ ఆరాధ్య వెనకాల కిట్టు ఎందుకు పడతాడు..? కిట్టుకి ఆమె అంటే ఎందుకు అంత ఇష్టం..? ఫైనల్ గా ఆరాధ్య ఏం చేసింది అన్నది శారీ కథ.

సోషల్ మీడియాలో కాలంలో అందరినీ నమ్మితే ఎలాంటి రిస్క్ లో పడతామన్నది చెప్పేలా ఈ సినిమా కథ ఉంది. ఐతే చెప్పాల్సిన కథ ఒకటైతే దానికి ఆర్జీవి మార్క్ రొమాంటిక్ షో ఎక్కువైంది. ఒక దశలో అది శృతిమించింది అన్న భావన రాక తప్పదు. దర్శకుడు అంటూ పేరుకి గిరి కృష్ణ కమల్ పనిచేసినా ఈ సినిమా అంతా కూడా ఆర్జీవి ఆధ్వర్యంలోనే జరిగినట్టు అనిపిస్తుంది.

ఐతే కథ కథనాలు ఎలా ఉన్నా ఆర్జీవి సినిమా అంటే టెక్నికల్ గా బాగుంటుంది. ముఖ్యంగా ఆయన సినిమా అంటే కెమెరా యాంగిల్స్, సౌండింగ్ బాగుంటుంది. కానీ ఎందుకో శారీలో ఇవి లోపించాయని అనిపిస్తుంది. ఒకదశలో ఆర్జీవి కంపెనీ నుంచి వచ్చిన సినిమానేనా అన్న డౌట్ రాక తప్పదు. ఆరాధ్య ఉన్న కాసేపు మెరుపులు మెరిపించింది. సత్య కూడా తన నటనతో ఒకరకంగా భయపెట్టాడు.

ఆర్జీవి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరు ఊహించరు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తన సినిమాలు ఉండేలా చూసుకునే ఆర్జీవి ఇంత నాసిరకంగా సినిమా చేస్తాడని ఊహించలేరు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నామమాత్రంగానే ఉన్నాయి. సో శారీ అంటూ ఆరాధ్య దేవి తో ప్రమోషన్స్ చేసిన ఆర్జీవి సినిమాను ఏమాత్రం ఆసక్తిగా తీయలేకపోయాడు. ఆర్జీవి సినిమాలంటే ఇప్పటికీ కాస్త కూస్తో ఆసక్తి చూపించే ఆడియన్స్ ఈ సినిమా చూశాక నిరాశకు గురి కాక తప్పదు.