Begin typing your search above and press return to search.

సమోసా ఫ్రీ అన్నా కూడా సినిమా చూడట్లే..

ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో సినిమాలకి ఆశించిన స్థాయిలో ఆదరణ రావడం లేదు.

By:  Tupaki Desk   |   17 July 2024 4:10 AM GMT
సమోసా ఫ్రీ అన్నా కూడా సినిమా చూడట్లే..
X

ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో సినిమాలకి ఆశించిన స్థాయిలో ఆదరణ రావడం లేదు. ముఖ్యంగా ఓటీటీ ఛానల్స్ ఇంపాక్ట్ థియేటర్స్ రిలీజ్ పైన హెవీగా ఉంది. ఒకప్పుడు సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చిన కూడా కనీసం 20-30 రోజులు థియేటర్స్ లో సినిమాకి ప్రేక్షకాదరణ వస్తూ ఉండేది. ఇండస్ట్రీలో 100 రోజులకి పైగా సినిమా ఆడటం అంటే రికార్డ్ గా భావించేవారు. ఇప్పుడు రికార్డులు కలెక్షన్స్ రూపం లో కేలిక్యులేట్ చేస్తున్నారు. ఎంత ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తే అంత పెద్ద హిట్ గా పరిగణిస్తున్నారు.

సినిమా అనేది ఒక బిజినెస్ కాబట్టి అంతిమంగా కలెక్షన్స్ ప్రామాణికంగా ఉంటాయి. కలెక్షన్స్ రాకుంటే ఎంత పాజిటివ్ టాక్ వచ్చిన కూడా డిజాస్టర్ గానే భావించాలి. ప్రస్తుతం థియేటర్స్ లో రిలీజ్ అయిన 2-3 వారాల్లోనే కొత్త సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు ఇంట్లో సినిమా చూసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలపై టికెట్ ధరలు కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయని చెప్పొచ్చు. ఒకప్పుడు 10, 20 రూపాయిలు పెడితే సినిమా చూసేసేవారు. అయితే ఇప్పుడు 150 రూపాయిలు కచ్చితంగా పెట్టాలి.

మార్కెట్, బడ్జెట్ లని దృష్టిలో ఉంచుకొని టికెట్ ధరలు పెంచారు. ఇదే సమయంలో ఓటీటీలో హవా మొదలైంది. ఈ ప్రభావం సినిమాలపై స్పష్టంగా ఉంది. తాజాగా అక్షయ్ కుమార్ సర్ఫిరా మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాకి రీమేక్ గా ఇది తెరకెక్కింది. మూవీకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ ప్రేక్షకాదరణ మాత్రం పెరగడం లేదు. వీకెండ్ తర్వాత కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.

వీకెండ్ మూడు రోజులు ఈ సినిమా కేవలం 12.50 కోట్ల నెట్ వసూళ్లు చేసి తీవ్ర నిరాశ పరిచింది. దీంతో మేకర్స్ సినిమా చూస్తే టీ, సమోసా ఫ్రీ అని ఆఫర్ పెట్టారు. అలా అయిన కలెక్షన్స్ పెరుగుతాయేమో అని ఆశించారు. అయితే నాలుగో రోజు ఈ సినిమాకి 1.4 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చారంట. ఓవరాల్ గా 14 కోట్లు వసూళ్లు వచ్చాయి. సినిమాని ప్రేక్షకులకి చేరువ చేయడానికి ఆఫర్ పెట్టిన కూడా పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది.

దీంతో పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా అక్షయ్ కుమార్ కెరియర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా సర్ఫిరా మూవీ నిలవబోతోందని అర్ధమవుతోంది. ఈ సినిమా కలెక్షన్స్ ఇంత దారుణంగా రావడానికి అక్షయ్ కుమార్ వరుస ఫెయిల్యూర్స్ ఒక కారణం కాగా, ఇప్పటికే ఓటీటీ లో సూరరై పోట్రు సినిమాని మెజారిటీ ఆడియన్స్ చూసేయడం కూడా మరో రీజన్ గా కనిపిస్తోంది.