Begin typing your search above and press return to search.

అడ్వాన్స్ బుకింగ్స్ లో 'సరిపోదా' బీభత్సం..

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   1 Sep 2024 4:54 AM GMT
అడ్వాన్స్ బుకింగ్స్ లో సరిపోదా బీభత్సం..
X

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. మొదటి రోజు మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి ఫస్ట్ డే 19+ కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వచ్చాయి. దీనిని బట్టి సినిమాకి ఏ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో నాని వరుస విజయాలు అందుకున్నారు.

సరిపోదా శనివారంతో ఇక విజయాల పరంపరని నాని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన రెండో రోజు నుంచి తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ భీభత్సంతో జనాలు అవసరం ఉంటే గాని బయటకు రావడం లేదు. అయిన కూడా చాలా చోట్ల ఈ సినిమాకి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి.

మొదటి రోజు 191K టికెట్స్ బుక్ పై షోలో సరిపోదా శనివారం సినిమాకి బుక్ అయ్యాయి. రెండో రోజు శుక్రవారం 194K టికెట్స్ బుక్ అయ్యాయి. శనివారం ఆ నెంబర్ మరింత పెరిగింది. ఏకంగా 204K టికెట్స్ బుక్ మై షోలో బుక్ కావడం విశేషం. అంటే భారీ వర్షాలు పడుతున్న కూడా ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి థియేటర్స్ కి తరలివస్తున్నారని అర్ధమవుతోంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందనే మాట వినిపిస్తోంది.

మూడు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేసిందని తెలుస్తోంది. నాలుగో రోజైన ఆదివారం కూడా బుకింగ్స్ పరంగా సరిపోదా శనివారం సినిమాకి ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. బుక్ మై షోలో సరిపోదా శనివారం రేటింగ్ కూడా టాప్ నాచ్ లో ఉంది. 10కి 9.1 స్టార్స్ రేటింగ్ తో మూవీ నడుస్తోంది. అంటే పబ్లిక్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సినిమాకి వస్తోందని తెలుస్తోంది.

ఓవరాల్ గా చూసుకుంటే వర్షాల ఇంపాక్ట్ కలెక్షన్స్ పై తెలుగు రాష్ట్రాలలో ఎంతో కొంత ఉండొచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు. ప్రేక్షకాదరణ పరంగా బుక్ మై షోలో కనిపిస్తోన్న ట్రెండ్ కొనసాగితే నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ఈ చిత్రం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో నాని కంటే ఎస్ జె సూర్య పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ విషయాన్ని నాని కూడా సక్సెస్ మీట్ లో ఒప్పుకున్నారు.