Begin typing your search above and press return to search.

లెంగ్త్ సరిపోని సరిపోదా శనివారం.. డిలీటెడ్ సీన్స్ ఇవే..

దీంతో సరిపోదా శనివారం చిత్రం పై అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   24 Sep 2024 12:23 PM GMT
లెంగ్త్ సరిపోని సరిపోదా శనివారం.. డిలీటెడ్ సీన్స్ ఇవే..
X

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరికొత్త చిత్రం సరిపోదా శనివారం. మొదటి నుంచి పాజిటివ్ బజ్ తో ఉన్న ఈ మూవీకి ప్రేక్షక ఆదరణ కూడా అదే రేంజ్ లో లభించింది. నాని కెరీర్ లో హ్యాట్రిక్ హిట్ అందించిన ఈ చిత్రం వివేక ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో అంటే సుందరానికి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ మూవీ ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో సరిపోదా శనివారం చిత్రం పై అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీలో నాని తర్వాత మరొక స్పెషల్ అట్రాక్షన్ విలన్ పాత్ర పోషించిన ఎస్‌జే సూర్య. నెగిటివ్ రోల్ ప్లే చేసినప్పటికీ తన నటనతో నానికి ధీటుగా నటించి అందరిని మెప్పించాడు సూర్య. ఇక ఈ చిత్రం 27 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీంతో ఈ మూవీని ఎంజాయ్ చేయడానికి మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

అయితే స్ట్రీమింగ్ డేట్ దగ్గర పడే కొద్ది మూవీలో ఒక సీన్స్ ఒక్కొక్కటి విడుదలవుతున్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి డిలీటెడ్ సీన్స్ కొన్ని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసిన అభిమానులు ఈ సీన్స్ సినిమాలో ఉంటే మరింత బాగుండేది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా లెంగ్త్ ఎక్కువ ఉండడంతో ఈ సీన్స్ ను మూవీ నుంచి తొలగించారు. అయితే వీటిలో ఎన్నింటిని స్ట్రీమింగ్ వర్షన్ లో కలుపుతారో తెలియదు. వీటిలో డాక్టర్ కి ఎస్ జె సూర్య కి మధ్య జరిగే ఓ కామెడీ సీన్ బాగా హైలైట్ గా ఉంది. ఇంతకీ ఆ సీన్స్ ఏంటో మీరు కూడా ఓ లుక్కెయ్యండి…