Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం.. కిక్కిచ్చే డైలాగ్స్

నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి పబ్లిక్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.

By:  Tupaki Desk   |   30 Aug 2024 8:30 AM GMT
సరిపోదా శనివారం.. కిక్కిచ్చే డైలాగ్స్
X

నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి పబ్లిక్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. రివ్యూలు కూడా చాలా వరకు పాజిటివ్ గానే వచ్చాయి. నాని కెరియర్ లో డిఫరెంట్ ఎలిమెంట్ తో చేసిన చిత్రం కావడంతో ఇప్పుడు సరిపోదా శనివారంపై అటెన్షన్ పెరిగింది. వీకెండ్ లో భారీ కలెక్షన్స్ ని ఈ మూవీ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే సరిపోదా శనివారం సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్, అంతకుమించి ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులకి కనెక్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మూవీలో వివేక్ ఆత్రేయ రాసిన డైలాగ్స్ కూడా చాలా బలంగా మంచి సందర్బోచితంగా పేలాయని అంటున్నారు. ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా సరిపోదా శనివారం సినిమాలో డైలాగ్స్ ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

ఈ డైలాగ్స్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇంటరెస్టింగ్ చర్చ నడుస్తోంది. సినిమాలో కొన్ని ఇంటరెస్టింగ్ డైలాగ్స్ ని ఫ్యాన్స్ కోట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని చూసుకుంటే ఇలా ఉన్నాయి.

-కర్ణుడి యుద్ధం ఆపేసింది భూదేవి, అది ఆమె కోపం. ఇక్కడ సూర్య కోపాన్ని ఆపేసింది ఛాయాదేవి, అది ఆమె ప్రేమ.

-తల్లి భూదేవి కన్నా చాలా గొప్పది. ఆమె ముందు మన కోపం చాలా చిన్నది.

-మన ప్రేమ చూస్తే నలుగురు మన దగ్గరకి రావాలి. అది నిజమైన ప్రేమ. మన కోపం చూస్తే నలుగురికి ధైర్యం రావాలి. అది నిజమైన కోపం.

-మన ఇంటి దాకా కష్టం రాకూడదని దేవుడికి మొక్కాలి. కష్టం గడపదాటితే మనమే దేవుడవ్వాలి.

- రెండు కళ్ళతో చూసుకోవడం కాదు మూడో కన్నుతో కాపాడుకోవాలి.

- ఒక్కోసారి మనవాళ్ళ కోసం కర్ణుడిలా ఆయుధాలు వదిలేయాలి. అవసరం వస్తే వాళ్ళ కోసం హనుమంతుడిలా దూకి యుద్ధం చేయాలి.

-మన దీపావళి కోసం ఏ సత్యభామ ఏ కృష్ణుడిని తీసుకురాదు. మన ధర్మం కోసం విష్ణువు కల్కిగా వస్తాడో రాడో తెలియదు.

- అవతారాల కోసం ఎదురుచూడకూడదు. అటువైపు ఎవడున్న మనమే ఎదురించాలి.

- మనిషి నుండే దేవుడు పుట్టాడు. మనిషి కోసం మనిషే రావాలి దేవుడు రాడు. ఇలాంటి ఆలోచింపజేసే పవర్ ఫుల్ డైలాగ్స్ మూవీలో చాలా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.