Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం.. అందరికి ఎక్కేసింది..

నేచురల్ స్టార్ రీసెంట్ మూవీ సరిపోదా శనివారం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   2 Sep 2024 6:18 AM GMT
సరిపోదా శనివారం.. అందరికి ఎక్కేసింది..
X

నేచురల్ స్టార్ రీసెంట్ మూవీ సరిపోదా శనివారం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. వివేక్ ఆత్రేయ ప్రెజెంటేషన్, నాని, ఎస్ జె సూర్య పెర్ఫార్మెన్స్ వెరసి మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కల్కి2898ఏడీ తర్వాత టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటున్న చిత్రంగా సరిపోదా శనివారం మూవీ నిలిచింది.

యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉన్న కూడా అంతకుమించి ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా సరిపోదా శనివారం చిత్రంలో కావాల్సినంత ఉందనే స్పందన సాధారణ ప్రేక్షకుల నుంచి వస్తోంది. ఈ కారణంగానే అన్ని వర్గాల వారు సరిపోదా శనివారం సినిమాని ఆదరిస్తున్నారు. సాయంత్రం, నైట్ షోలు తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో ఆల్ మోస్ట్ హౌస్ ఫుల్ పడుతున్నాయంట. అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా సినిమాని చూడటానికి తరలివస్తున్నారంట.

కేవలం ఒక వర్గం ప్రేక్షకులకి మాత్రమే పరిమితం కాకుండా అందరిని ఆకట్టుకునే కథలతో నాని సినిమాలు చేస్తూ వస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు, క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ వరకు అందరిని తన సినిమాలతో నాని సంతృప్తి పరుస్తున్నారు. సరిపోదా శనివారం సినిమాతో ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా ఆడుతున్న మేగ్జిమమ్ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. దీనిని బట్టి ప్రేక్షకులు నాని మీద ఎంత అభిమానం చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

నాని స్టోరీ సెలక్షన్ కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని చేస్తారు. అందుకే మిగిలిన హీరోల సినిమాల తరహాలో నాని మూవీస్ లో ఐటెం సాంగ్స్ పెద్దగా కనిపించవు. టాలీవుడ్ లో నిర్మాతలకి కూడా నాని ఇప్పుడు బెస్ట్ ఛాయస్ గా ఉన్నారు. అతనితో సినిమా చేస్తే పెట్టిన పెట్టుబడి కచ్చితంగా రికవరీ అవుతుందనే కాన్ఫిడెన్స్ అందరిలో ఉంది. అందుకే చాలా మంది ప్రొడ్యూసర్స్ నానితో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.

ఇక సరిపోదా శనివారం సినిమాకి మొదటి మూడు రోజుల్లోనే 50 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయంటే ఏ స్థాయిలో ఆదరణ వస్తోందో అంచనా వేయొచ్చు. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాల క్రమం చూసుకుంటే ప్రతి కథలో ఏదో ఒక ఇంటరెస్టింగ్ ఫ్యాక్టర్ ని నాని టచ్ చేస్తున్నాడు. డిఫరెంట్ జోనర్ లలో ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే నాని టైర్ 1 హీరోల జాబితాలోకి అతి త్వరలో చేరిపోవడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.