Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్.. ప్రీమియర్స్ తోనే నాని న్యూ రికార్డ్

నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం గురువారం గ్రాండ్ గా విడుదలైంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 5:51 PM GMT
బాక్సాఫీస్.. ప్రీమియర్స్ తోనే నాని న్యూ రికార్డ్
X

నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం గురువారం గ్రాండ్ గా విడుదలైంది. నాని కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ విడుదలైన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక విడుదలైన మొదటి షో నుంచే సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య నిర్మించారు. ఇక సినిమా విడుదలకు ముందే వరుస అప్డేట్స్ తో సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది.

ఇక విడుదల అనంతరం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోలు విశేష ఆదరణ పొందాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీమియర్ షోల ద్వారా మొత్తం $548K వసూలు చేసింది. ఇది నాని కెరీర్‌లో రెండో అత్యధిక ప్రీమియర్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.

సినిమాలో నాని యాక్టింగ్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పుష్కలంగా ఉన్న యాక్షన్ సన్నివేశాలు, ఆసక్తికరమైన కథాంశం సినిమాకు ప్రధాన బలం. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా మలిచినట్లు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో కూడా నాని మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనేలా హాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

నాని ఫ్యాన్స్ సినిమా విజయంపై తెగ ఆనందపడుతున్నారు. దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో ఒక పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటున్నాడు అని పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎస్.జె. సూర్య.పవర్ఫుల్ విలన్ గా నటించాడు. ఆయన గత సినిమాల కంటే ఇందులోని క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా హైలెట్ అయ్యింది.

నాని సూర్య కాంబినేషన్లో వచ్చిన సీన్స్ విజిల్స్ వేసేలా ఉన్నాయి. ఇక క్యూట్ హీరోయిన్ ప్రియాంక మోహన్ సినిమాలో నానికి జోడిగా నటించింది. ఆమె నటన కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. సినిమా విజయంతో ప్రొడక్షన్ హౌస్ DVV ఎంటర్టైన్మెంట్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. సినిమా అయితే ప్రస్తుతానికి మంచి వసూళ్లను సాధిస్తోంది, ఇక ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద నెంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా నాని ఈ సినిమాలో ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తాడో చూడాలి.