Begin typing your search above and press return to search.

నాని.. ఎంత బరువున్నా బ్యాలెన్స్ చేయగలిగే హీరో

నేచురల్ స్టార్ నాని ఒక సినిమాను మొదలుపెట్టాడు అంటే అది పూర్తయ్యేవరకు ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు.

By:  Tupaki Desk   |   28 Aug 2024 10:24 AM GMT
నాని.. ఎంత బరువున్నా బ్యాలెన్స్ చేయగలిగే హీరో
X

నేచురల్ స్టార్ నాని ఒక సినిమాను మొదలుపెట్టాడు అంటే అది పూర్తయ్యేవరకు ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఒకవైపు దర్శకుడికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూనే మరొకవైపు తన ఆలోచన విధానాలను కూడా అందిస్తూ ఉంటాడు. ఒకప్పుడు అతను కూడా సహాయ దర్శకుడిగా వర్క్ చేశాడు.. కాబట్టి ఆ రోల్ పైన అతనికి అవగాహన ఉంది. ఒకసారి దర్శకుడి నమ్మితే నాని సొంత ప్రొడక్షన్ లో అయినా సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటాడు.

ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ లో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ప్రమోషన్స్ లో దర్శకుడు వివేక్ ఆత్రేయ పెద్దగా కనిపించలేదు. అందుకు కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అతను చాలా బిజీగా ఉన్నాడు. సినిమా ఫైనల్ మిక్సింగ్, క్యూబ్ చెకింగ్, యూఎస్ ప్రింట్స్ కు సంబంధించిన కొన్ని స్పెషల్ కాపీలు సిద్ధం చేసే పనుల్లో అతను బిజీగా గడపాల్సి వచ్చింది.

అలాగే చిన్న చిన్న కరెక్షన్స్ అన్ని చూసుకోవాలి అంటే మామూలు విషయం కాదు. దర్శకుడు వివేక్ ఏ ఒక్క పొరపాటు జరగకుండా అన్ని సక్రమంగా జరగాలి అని గత కొన్ని రోజులుగా నిద్ర లేకుండా వర్క్ చేస్తున్నాడు. అయితే అతను సడన్ గా కొంత అస్వస్థతకు గురి కావడంతో నాని రంగంలోకి దిగాడు. వివేక్ ను రెస్ట్ తీసుకోమని చెప్పి తను ఒక రెండు రోజులు డైరెక్టర్ కుర్చీలో కూర్చున్నాడు.

పూర్వం సహాయక దర్శకుడిగా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి దర్శకుడు లేకపోయినా హీరో నాని పని మొత్తం తన భుజాలపై వేసుకున్నాడు. ఫైనల్ మిక్సింగ్ అలాగే చిన్న చిన్న కరెక్షన్ లు ఉంటే అన్ని చెక్ చేసి ఫుల్ కాపీతో సినిమాను సిద్ధం చేశాడు. గత 48 గంటలు ఈ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడట. కేవలం రెండు గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని ఫైనల్ కాఫీ సిద్ధం చేయించినట్లుగా తెలుస్తోంది.

దీన్ని బట్టి నాని ఒక సినిమా కోసం ఎంతగా కృషి చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా పనులు కొనసాగిస్తూనే మరొకవైపు బెంగళూరులో ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు. అన్ని వైపులా సినిమా కోసం కష్టపడుతున్న నాని ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలి అని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక సినిమా కంటెంట్ కూడా ఇప్పటికే జనాల్లో మంచి మంచి అంచనాలను క్రియేట్ చేసింది. కాబట్టి సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం కనిపిస్తోంది.