Begin typing your search above and press return to search.

'సరిపోదా' అల వైకుంఠపురం..!

సౌత్‌ సినిమాలను బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఆసక్తిగా చూస్తున్నారు. ఎక్కువ శాతం తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Dec 2024 5:33 AM GMT
సరిపోదా అల వైకుంఠపురం..!
X

సౌత్‌ సినిమాలను బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఆసక్తిగా చూస్తున్నారు. ఎక్కువ శాతం తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి. కొన్ని చిన్న సూపర్‌ హిట్‌ సినిమాలను నార్త్‌లో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగు సినిమాల కథలను హిందీ ప్రేక్షకులు తెగ ఆదరిస్తున్న నేపథ్యంలో త్వరలో మరో తెలుగు సినిమా నార్త్‌లో రీమేక్‌కి రెడీ అవుతోంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'సరిపోదా శనివారం' సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఓటీటీ ద్వారా అలరించింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ హిందీ వర్షన్‌ను నార్త్‌లో స్ట్రీమింగ్‌ చేసింది. చాలా మంది ఇప్పటికే చూశారు.

ఈ ఓటీటీ రోజుల్లోనూ సరిపోదా శనివారం సినిమాను రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రీమేక్‌ వర్షన్‌లో నాని స్థానంలో బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా నటించబోతున్నాడు. ఈయన గతంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ మూవీ అల వైకుంఠపురంలో సినిమాను రీమేక్ చేశాడు. టాలీవుడ్‌ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన అల వైకుంఠపురంలో సినిమా హిందీలో డిజాస్టర్‌గా నిలిచింది. హిందీ ప్రేక్షకులు అంతకు ముందే ఓటీటీ, టీవీల ద్వారా చూశారు. అందుకే రీమేక్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు అదే తప్పును కార్తీక్‌ ఆర్యన్‌ మరోసారి చేస్తున్నాడు అనే విమర్శలు కొందరు చేస్తున్న, అస్సలు తగ్గేది లేదు అంటూ ముందుకు వెళ్తున్నాడు.

అల వైకుంఠపురంలో రీమేక్‌తో డిజాస్టర్‌ను చవిచూసినా సరిపోదా శనివారం అవసరమా అంటూ కొందరు ఆయనను హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రీమేక్‌కి సంబంధించిన వర్క్‌ షురూ అయ్యింది. త్వరలోనే సినిమా షూటింగ్‌ సైతం మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. భూల్‌ భులయ్యా ప్రాంచైజీలో భారీ విజయాలను సొంతం చేసుకున్న కార్తీక్‌ ఆర్యన్‌ అదే జోనర్‌లో లేదా కొత్త కథలతో సినిమాలు చేస్తే బాగుంటుంది. రీమేక్ ఈ సమయంలో అస్సలు మంచిది కాదు అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన రీమేక్ సినిమాలు నార్త్‌ బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అందుకే ఈ సినిమా ఫలితం విషయంలో కాస్త తేడా కొట్టే అవకాశాలు లేకపోలేదు.

నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్‌ను క్రియేట్‌ చేసింది. కానీ సినిమా ఆ స్థాయిలో లేదు అంటూ కొందరు విమర్శలు చేశారు. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ పర్వాలేదు అన్నట్లు సాగినా సెకండ్‌ హాఫ్‌ విషయంలో నిరుత్సాహం కనబర్చారు. అయినా సినిమాను రీమేక్ చేసేందుకు కార్తీక్‌ ఆర్యన్‌ టీం రెడీ అవుతున్నారు. ఈ రీమేక్‌ ఎంత వరకు దారి తీస్తుందా అనేది చూడాలి. నాని ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే భారీ సినిమాను చేస్తున్నాడు. మరో వైపు హిట్ 3 సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.