Begin typing your search above and press return to search.

హిట్ టాక్ వస్తే చాలు.. ఇక బీభత్సమే..

అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి 100కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులని ఎక్కువ స్థాయిలో ఎట్రాక్ట్ చేసి థియేటర్స్ రప్పించిన సినిమాలు ఈ మూడు మాత్రమే.

By:  Tupaki Desk   |   24 Aug 2024 4:44 AM GMT
హిట్ టాక్ వస్తే చాలు.. ఇక బీభత్సమే..
X

ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెప్పుకోదగ్గ సక్సెస్ లు రాలేదు. ఓ నాలుగు వారాల పాటు ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాలంటే వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఈ ఏడాది ఆరంభంలో హనుమాన్ సినిమా ప్రేక్షకులని భారీగా థియేటర్స్ కి వచ్చేలా చేసింది. తరువాత సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్వైర్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా మూడు వరాల పాటు ప్రేక్షకులని ఎంటెర్టైన్ చేసింది. మరల గత నెల రిలీజ్ అయిన కల్కి 2898ఏడీ మూవీ నాలుగు వారల పాటు ప్రేక్షకులు థియేటర్స్ కి రప్పించింది.


అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి 100కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులని ఎక్కువ స్థాయిలో ఎట్రాక్ట్ చేసి థియేటర్స్ రప్పించిన సినిమాలు ఈ మూడు మాత్రమే. ఆగస్టు నెలలో రిలీజ్ అయిన వాటిలో చిన్న సినిమాలైనా కమిటీ కుర్రోళ్లు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రేక్షకులని బాగానే మెప్పించాయి. అయితే సాలిడ్ గా బీ,సి సెంటర్స్ ని కూడా హౌస్ ఫుల్ చేయగలిగే సత్తా అంటే మాస్ సినిమాలకి మాత్రమే ఉంటుంది.


అలాంటి మాస్ బొమ్మ ఆగష్టు 29న రాబోతోంది. నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమాపై పాజిటివ్ బుజ్ ఉంది. హిట్ పడితే మాత్రం మూడు, నాలుగు వారాలు మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే హైవోల్టేజ్ మాస్ యాక్షన్ మూవీ దేవర కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా హిట్ అయితే తెలుగు రాష్ట్రాలలో మాస్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని, కలెక్షన్స్ పరంగా బీభత్సం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి మాస్ బొమ్మల కోసం ప్రేక్షకులు కూడా చాలా ఆకలితో ఎదురుచూస్తున్నారు. సరిపోదా శనివారం, దేవర సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటే రెండు నెలల పాటు టాలీవుడ్ లో ఫుల్ సందడి వాతావరణం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మూవీ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దేవరపై దేశవ్యాప్తంగా అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.