Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం ట్రైలర్: మాస్ కంటెంట్‌తో శివ తాండవం

టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాని, ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ సినిమాతో రాబోతున్నాడు

By:  Tupaki Desk   |   13 Aug 2024 3:27 PM GMT
సరిపోదా శనివారం ట్రైలర్: మాస్ కంటెంట్‌తో శివ తాండవం
X

టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాని, ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ సినిమాతో రాబోతున్నాడు. ఇక ట్రైలర్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే విపరీతమైన అంచనాలను రేకెత్తిస్తోంది. ‘అంటే సుందరానికి’ వంటి క్లాస్ చిత్రానికి దర్శకుడైన వివేక్, ఈసారి మాత్రం మాస్ జానర్‌లోకి అడుగుపెట్టారు.

ట్రైలర్ విషయానికొస్తే, మొదటగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది నాని పాత్ర. గత చిత్రాల్లో మునుపెన్నడూ చూడని కొత్త మాస్ అవతారంలో నాని కనిపించడం, ఆయన నటనపై ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్‌లో సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో నాని పాత్రను ఎలివేట్ చేసిన విధానం, ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా ఉంది. మాస్ యాక్షన్ సన్నివేశాలు, మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ డైలాగ్‌లు నాని ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

కోపం వస్తే ఎదుటి వాడి కష్టాన్ని కూడా తన కష్టంగా ఫీల్ అవ్వడం, కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించడం అలాగే డైరీ లో పేరు రాసి రౌండప్ చేసి ఆ వ్యక్తి అంతు చూడడం వంటి అంశాలు హైలెట్ అవుతున్నాయి. ప్రియాంక మోహన్‌తో నాని కెమిస్ట్రీ కూడా మరో ఆకర్షణ. ట్రైలర్‌లో ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని సున్నితమైన సన్నివేశాలు కూడా చూపించారు.

దర్శకుడు వివేక్ ఆత్రేయ గత చిత్రంలోని క్లాస్ కంటెంట్‌ని పక్కన పెట్టి, పూర్తి మాస్ ఎంటర్టైనర్‌గా ‘సరిపోదా శనివారం’ని రూపొందించడం విశేషం. సైకో పోలీస్ పాత్రలో ఎస్.జె. సూర్యతో నాని పోటాపోటీగా నటించడం, వీరిద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. సూర్య పాత్రకు ఉన్న పవర్, ఆయనతో నాని మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు సినిమా మొత్తం రసవత్తరంగా సాగుతాయని సంకేతాలు ఇస్తున్నాయి.

సినిమాలోని సంగీతం కూడా పెద్ద ప్లస్ పాయింట్. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలకు మునుపెన్నడూ లేని ఇంటెన్సిటీని అందించింది. వీటితో పాటు, ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా ఉన్నాయి. సినిమా పేరు వెనుక ఉన్న కథనం కూడా ఆసక్తికరమే. ట్రైలర్ చూస్తే, నాని పాత్ర శనివారం రోజుననే తన కోపాన్ని బయటపెడతాడు అనే విషయం క్లియర్‌గా తెలుస్తుంది.

ఈ అంశం సినిమాకి కొత్తదనం తీసుకొస్తుంది. సినిమా కథలో సడెన్ ట్విస్టులు, లవ్ ట్రాక్, మరియు డ్రామా సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల అవుతుంది, పాన్ ఇండియా స్థాయిలో తమిళ్ హిందీ కన్నడ మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. నాని అభిమానులే కాదు, ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి, ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ చూస్తే, సినిమాను చూడాలి అనే ఆసక్తిని కలిగిస్తోంది. మరి బిగ్ స్క్రీన్ పై సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.