Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం.. ఆత్రేయ మళ్ళీ అదే రిస్క్?

నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కి ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం సరిపోదా శనివారం

By:  Tupaki Desk   |   21 Aug 2024 5:52 AM GMT
సరిపోదా శనివారం.. ఆత్రేయ మళ్ళీ అదే రిస్క్?
X

నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కి ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం సరిపోదా శనివారం. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సరిపోదా శనివారం సినిమాపైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. కచ్చితంగా నాని కెరియర్ లో మరో 100 కోట్ల కలెక్షన్స్ చిత్రంగా ఈ మూవీ మారుతుందని అంచనా వేస్తున్నారు.

దసరా, హాయ్ నాన్నల తర్వాత హ్యాట్రిక్ హిట్ ని ఈ చిత్రంతో అందుకోవాలని నాని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే సినిమాకి సుమారు 174 నిమిషాల 50 సెకండ్స్ రన్ టైం ఉందంట. సుదీర్ఘ రన్ టైం అనేది ఒక్కోసారి సినిమాలకి పాజిటివ్ అవుతుంది. ఒక్కోసారి అదే నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. గతంలో సినిమా కథలని మూడు గంటల నిడివిలో చెప్పేవారు. తరువాత ఈ రన్ టైం క్రమంగా తగ్గిపోయి 2 గంటలకి వచ్చేసింది. 2-2:30 గంటల మధ్యలోనే ఇప్పుడు చాలా సినిమాలు ఉంటున్నాయి.

అయిన కూడా కొన్ని సినిమాలు కథ బాగా ల్యాగ్ ఉందనే విమర్శలని ఎదుర్కొన్నాయి. యానిమల్ సినిమా కథ నిడివి మూడు గంటలకి పైగా ఉన్న బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టలేదు. గత నెల రిలీజ్ అయిన కల్కి మూవీ రన్ టైం కూడా 3 గంటలకి పైగానే ఉన్న సూపర్ హిట్ అయ్యింది. అదే భారతీయుడు 2 మూవీకి 3 గంటల నిడివి రన్ టైం మైనస్ అయ్యింది.

గతంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని అంటే సుందరానికి సినిమా చేశారు. ఈ సినిమా 176 నిమిషాల నిడివి ఉంది. అంటే సుమారు 3 గంటలకి 4 నిమిషాలు తక్కువ. ఆ సినిమా ల్యాగ్ అయ్యిందనే విమర్శలు ఎదుర్కొంది. అందుకే పూర్తిస్థాయిలో క్లిక్ అవ్వలేదు. ఈ సారి సరిపోదా శనివారం మూవీలో డ్రామా కంటే యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి. వివేక్ ఆత్రేయ కూడా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ మూవీ చేశారు.

సరిపోదా శనివారం సినిమాకి 174 నిమిషాల 50 సెకండ్స్ రన్ టైం ఉంది. అంటే సుమారు 5 నిమిషాల తక్కువ 3 గంటల నిడివితో ఈ మూవీ ఉండబోతోందని అర్ధమవుతోంది. యాక్షన్ కథలకి నిడివి ఎక్కువ ఉన్న బోర్ కొట్టకుండా కథనం ఉంటే క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని యానిమల్ ప్రూవ్ చేసింది. మరి నానికి సరిపోదా శనివారం సినిమాకి ఈ రన్ టైం ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.