Begin typing your search above and press return to search.

7AM షో కోసం నానీ ఫ్యాన్స్ వెయిటింగ్

నేచురల్ స్టార్ నాని నటించిన `సరిపోదా శనివారం` ఈ సీజ‌న్‌లో భారీ క్రేజ్‌తో థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Aug 2024 7:11 AM GMT
7AM షో కోసం నానీ ఫ్యాన్స్ వెయిటింగ్
X

నేచురల్ స్టార్ నాని నటించిన `సరిపోదా శనివారం` ఈ సీజ‌న్‌లో భారీ క్రేజ్‌తో థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు వ‌రుస విజ‌యాల త‌ర్వాత హ్యాట్రిక్ కోసం నాని త‌పిస్తున్నాడు. ఈసారి మాస్‌లో మ్యాసివ్ హిట్ కొట్టాల‌ని భారీ యాక్ష‌న్ సినిమాతో దూసుకొస్తున్నాడు. గ‌తంలో సుంద‌రానికి ఫ్లాపైనా కానీ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఈ యాక్ష‌న్ సినిమా చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. అయితే గ‌త ప‌రాజ‌యంతో సంబంధం లేకుండా స‌రిపోదా శ‌నివారం చిత్రానికి క్రేజ్ నెల‌కొంది. టైటిల్ ఎంపిక నుంచి ఈ సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌చారం ప‌రంగాను టీమ్ వైవిధ్యంగా వెల్ల‌డం క‌లిసొస్తోంది. ఈ సినిమాకి ముందస్తు బుకింగ్‌లు కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి 7ఏఎం షోలు ఉంటాయని మేకర్స్ ధృవీకరించారు. టికెట్ల‌ అడ్వాన్స్ సేల్స్ ఈ బుధ‌వారం ఉదయం ప్రారంభమవుతాయని చిత్ర‌బృందం ఎక్స్ ఖాతాలో వెల్ల‌డించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు సింగిల్ స్క్రీన్‌లతో పాటు మల్టీప్లెక్స్‌లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అమెరికాలోను ముందస్తు అమ్మకాలు ఇప్పటివరకు ఆకట్టుకున్నాయని ట్రేడ్ చెబుతోంది. 7ఏఎం షో వేస్తున్నారు అంటే రోజుకు ఐదు షోలు వేస్తున్నార‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

స‌రిపోదా .. చిత్రంలో ప్రియాంక అరుల్‌మోహన్ క‌థానాయిక‌. ఎస్‌జె సూర్య, అభిరామి, అధితి బాలన్‌, సాయికుమార్‌ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. డివివి ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ గురువారం నుంచి థియేట‌ర్ల‌లో సినిమా అందుబాటులోకి వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాల్లోను బుకింగుల జోరు క‌నిపిస్తోందని టాక్.