Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం.. అక్కడ కూడా సౌండ్ మొదలైంది

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరిపోదా శనివారం సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి

By:  Tupaki Desk   |   17 Aug 2024 2:55 PM GMT
సరిపోదా శనివారం.. అక్కడ కూడా సౌండ్ మొదలైంది
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరిపోదా శనివారం సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది దసరా, హాయ్ నాన్న మూవీలతో సూపర్ హిట్లు అందుకున్న నాని.. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. విభిన్నమైన కాన్సెప్టులను ఎంచుకుంటూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్నారు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ హీరోయిన్ గా నటిస్తోంది. మూవీలో లేడీ కానిస్టేబుల్ చారులత రోల్ పోషిస్తోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఆమె లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది వరకే నాని, ప్రియాంక.. గ్యాంగ్ లీడర్ మూవీలో జోడీగా నటించి మెప్పించారు. ఇప్పుడు మళ్లీ సరిపోదా శనివారం మూవీ కోసం జత కట్టారు. పోస్టర్స్ అండ్ సాంగ్స్ లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అండ్ బాండింగ్ కు మంచి మార్కులే పడ్డాయి.

తాజాగా నాని, ప్రియాంక కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాట్వే లవ్లీ అండ్ క్యూట్ మూమెంట్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మూవీ అనౌన్స్మెంట్ నుంచి ప్రతీ శనివారం ఏదో ఒక అప్డేట్ ఇస్తున్న సరిపోదా శనివారం మేకర్స్.. నేడు తమిళ ట్రైలర్ ను విడుదల చేశారు. చెన్నైలో స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్ కు హీరో నాని, హీరోయిన్ ప్రియాంక, నటుడు ఎస్ జే సూర్య తదితరులు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు.

ఆ వేడుకకు సంబంధించిన చిత్రాలను మేకర్స్ నెట్టింట షేర్ చేశారు. వాటిలో కొన్ని క్యాండిడ్ క్లిక్స్ లో నాని, ప్రియాంక లవ్లీగా కనిపించారు. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతున్నట్లు ఉండగా.. ఆ పిక్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రీ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. పెయిర్ సూపర్ హిట్ అని చెబుతున్నారు. నేచురల్ లాఫ్ తో నాని బాగున్నారని కామెంట్లు పెడుతున్నారు. ప్రియాంక.. ఆల్వేస్ క్యూట్ అంటూ లవ్ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు.

అయితే చెన్నై ఈవెంట్ పిక్స్ లో ఎస్ జే సూర్య కూడా కిర్రాక్ లుక్ లో ఉన్నారు. ఆయన సినిమాలో విలన్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. జాక్స్ బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై డీవీవీ దానయ్య భారీగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానున్న సరిపోదా శనివారం మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.