ఫేమస్ కొరియోగ్రాఫర్ బయోపిక్ తెరపైకి!
ఈ ప్రాజెక్ట్ గురించి హన్సల్ అధికారికగా ప్రకటించారు.' ప్రస్తుతం నేను సరోజ్ ఖాన్ బయోపిక్ చిత్రం కోసం పనిచేస్తున్నా. స్క్రిప్ట్ దశలో ఉంది
By: Tupaki Desk | 14 Sep 2023 8:48 AM GMTబాలీవుడ్ ఫేమస్ దివంగత కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 300 చిత్రాలకు కొరియోగ్రఫీ చేసి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఎంతో మంది డాన్సర్లకు సహాయం చేసి వారికి స్పూర్తిగానూ నిలిచారు. తాజాగా ఇప్పుడామె సీని జీవితాన్ని వెండి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఆబాధ్యతలు హన్సల్ మెహతా- భూషణ్ కుమార్ తీసుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ గురించి హన్సల్ అధికారికగా ప్రకటించారు.' ప్రస్తుతం నేను సరోజ్ ఖాన్ బయోపిక్ చిత్రం కోసం పనిచేస్తున్నా. స్క్రిప్ట్ దశలో ఉంది. ఆమె జీవితం గురించి ఇంకా చాలా విషయాలు క్షుణంగా తెలుసుకోవాల్సి ఉంది. ఆమె వ్యక్తిగత జీవితం..సినిమాల్లోకి వచ్చే ముందు ఎలా ఉంది? పరిశ్రమకి వచ్చాక ఎలా మారింది? వంటి అంశాలు జాగ్రత్తగా చూపించాలి. ఇంకా ఆమె జీవితంలో ఎదురైన సవాళ్లు ప్రతీ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తున్నాం.
సరోజ్ ఖాన్ జీవితం గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ సినిమా చేస్తున్నాం. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు వినిపిస్తోంది. సరోజ్ ఖాన్ 2020లో గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ లో నాలుగు దశాబ్దాల ప్రయాణం. 2 వేలకు పైగా పాటలకు నృత్య రీతులను సమకూర్చారు. మూడేళ్ళ వయసులోనే 'నజరానా' సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఎంట్రీ ఇచ్చారు.
13 ఏళ్ల వయసులో తన గురువు సోహన్ లాల్‌ని పెళ్లి చేసుకున్నారు. తాను నృత్యం నేర్చుకునేందుకు క్లాసులకు వెళుతుండగా ఓ రోజు తనను అనూహ్యంగా మాస్టర్ సోహన్ లాల్ తన మెడలో తాళి కట్టారని ఓ ఇంటర్వ్యూలో సరోజ్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. వీరికి ముగ్గురు సంతానం. ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొన్నాళ్ల కాపురం అనంతరం విడిపోయారు. అయినా సోహాన్ ని గురువుగా భావించి ఆయన వద్ద శిష్యరికం కొనసాగించారు. భార్యభర్తలుగా విడిపోయినా గురు-శిష్యలుగా పనిచేసి జోడీగా మంచి పేరు దక్కించుకున్నారు.