Begin typing your search above and press return to search.

గూఢచారి 2... విభేదాల పుకార్లకు చెక్‌

అడివి శేష్‌ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   22 May 2024 9:56 AM GMT
గూఢచారి 2... విభేదాల పుకార్లకు చెక్‌
X

అడివి శేష్‌ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా సాధించిన విజయంతో ప్రస్తుతం సీక్వెల్‌ ను రూపొందించే పనిలో పడ్డారు. అడవి శేష్‌ హీరోగా కొనసాగుతూ ఉండగా దర్శకుడు మాత్రం మారడం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా ఉంది.

గూఢచారి సినిమా ను శశి కిరణ్ తిక్క అద్భుతంగా రూపొందించాడు. అయినా కూడా ఎందుకు సీక్వెల్‌ కు ఆయన్ను కాకుండా మరొకరిని ఎంపిక చేశారు అనేది చాలా మంది ప్రశ్న. అసలు విషయం ఏంటి అనేది ఇన్నాళ్లు ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాంతో పుకార్లు వస్తూనే ఉన్నాయి.

ఎట్టకేలకు దర్శకుడు శశి కిరణ్ తిక్క స్పందించాడు. తాను దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ వారంలో విడుదల అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చాడు. తాను గూఢచారి సినిమా సీక్వెల్‌ కు దూరంగా ఉండటంకు కారణం ఏంటి అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు.

అడివి శేష్‌ తో తనకు ఎలాంటి విభేదాలు లేవు. నేను ఉన్న బిజీ మరియు ఈ సినిమాకు వినయ్‌ కుమార్‌ న్యాయం చేస్తాడు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గూఢచారి సీక్వెల్‌ అనుకున్న సమయంలో నేను సత్యభామ సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్‌ కు కమిట్‌ అయ్యి ఉండటం వల్ల నాకు సాధ్యం అవ్వలేదు.

గూఢచారి సినిమాకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన వినయ్‌ కుమార్‌ ప్రతి విషయంలో చక్కని అవగాహణ ఉంది. నేను తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేసినా కూడా వినయ్ గూఢచారి సినిమా గురించిన ప్రతి విషయాన్ని, ప్రతి షాట్‌ ను గురించి చెప్పేవాడు.

గూఢచారి ప్రపంచం మొత్తం అతడికి బాగా తెలుసు. అందుకే నేను మరియు శేష్‌ కలిసి సీక్వెల్‌ కు వినయ్‌ కుమార్ అయితే న్యాయం చేయగలడు అని భావించాం. అందుకే అతడితో సీక్వెల్‌ ను చేయిస్తున్నట్లుగా దర్శకుడు శశి కిరణ్ చెప్పుకొచ్చాడు.

గూఢచారి 2 సినిమా గురించి వస్తున్న పుకార్లకు శశి కిరణ్‌ ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లు అయ్యింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి అభిషేక్‌ అగర్వాల్‌ మరియు అనిల్ సుంకర లు గూఢచారి సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్‌ పూర్తి చేసి ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.