సత్యం సుందరం ఆ 18 నిమిషాల కథ ఏంటి..?
కార్తీ అరవింద్ స్వామి కలిసి నటించిన సినిమా మేయలగన్. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.
By: Tupaki Desk | 27 Dec 2024 1:30 AM GMTకార్తీ అరవింద్ స్వామి కలిసి నటించిన సినిమా మేయలగన్. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి ఇద్దరు కూడా తమ బెస్ట్ యాక్టింగ్ తో మెప్పించారు. కార్తి ఎప్పటిలానే తన అమాయకత్వంతో అదరగొట్టేయగా అరవింద్ స్వామి కూడా మొహమాటస్తుడిగా మెప్పించాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ భలే ఎంటర్టైన్ చేసింది. ఐతే సత్యం సుందరం సినిమా థియేటర్ లో జస్ట్ ఓకే అన్నట్టుగా ఆడింది. సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యాక ఆహా ఓహో అద్భుతం అనేశారు.
అంతేకాదు సినిమాలో 18 నిమిషాల సీన్ ఒకటి ఉందని దాన్ని యాడ్ చేయమని ఓటీటీలో సినిమా చూసిన వారు మెసేజ్, కాల్స్ చేస్తున్నారు. ఐతే సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు చూడకుండా ఓటీటీలో వచ్చాక చూసి అడుగుతున్నారని అన్నారు. ఐతే సత్యం సుందరం సినిమాలో 18 నిమిషాల సీన్ ఉందని ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ఐతే కొన్ని సినిమాలు లెంగ్త్ ఎక్కువ అని ట్రిమ్ చేసి ఆ తర్వాత యూట్యూబ్ లో డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేస్తుంటారు.
కానీ సత్యం సుందరం సినిమాలో అలా 18 నిమిషాల సీన్స్ ఉన్నాయట. ఐతే అది థియేటర్ లో వేయలేదు కనీసం ఓటీటీలో అయినా వేస్తే బాగుండేది కదా అని అంటున్నారట. ఈమధ్య ఎక్కువ శాతం సినిమాలు థియేట్రికల్ వెర్షన్ వదిలి ఓటీటీలో చూసి సూపర్ అంటున్నారని అదేదో థియేటర్ లోనే చూస్తే సినిమా కమర్షియల్ సక్సెస్ అవుతాయని అన్నారు ప్రేం కుమార్. తన సినిమా కాబట్టి ప్రేమ్ కుమార్ ఇలా చెప్పడం కాదు దాదాపు ప్రతి డైరెక్టర్ ఇలానే ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూసి బాగుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కానీ థియేట్రికల్ రిలీజ్ టైం లో మాత్రం స్కిప్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఒక్కొక్కరిది ఒక్కో వెర్షన్ కాగా సత్యం సుందరం సినిమా డైరెక్టర్ మాత్రం ఇలా డైరెక్ట్ గానే ఆడియని అనేస్తున్నాడు. ఇక తను ప్రస్తుతం 96 సీక్వెల్ కథను సిద్ధం చేస్తున్నారు. 96 తర్వాత దాదాపు ఆరేడేళ్లు టైం తీసుకున్న ప్రేమ్ కుమార్ తర్వాత సినిమాకు మాత్రం అంత టైం తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. ప్రేమ్ కుమార్ 96 సీక్వెల్ అనగానే ఆ సినిమా లవర్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి సీక్వెల్ లో కూడా విజయ్ సేతుపతి, త్రిష నటిస్తారా లేదా వేరే వాళ్లని తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.