బాక్సాఫీస్.. సత్యం సుందరం పరిస్థితి ఎలా ఉందంటే..
కార్తీ, అరవింద్ స్వామి కాంబినేషన్ లో 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా ‘సత్యం సుందరం’.
By: Tupaki Desk | 4 Oct 2024 3:30 PM GMTకార్తీ, అరవింద్ స్వామి కాంబినేషన్ లో 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా ‘సత్యం సుందరం’. ఈ మూవీ సెప్టెంబర్ 28న థియేటర్స్ లోకి వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ కి కాంపిటేషన్ గా ఈ చిత్రం రావడంతో మూవీ పైన ఎక్కువ ఫోకస్ ఏర్పడింది. ఇంటరెస్టింగ్ కథలతో హీరోగా సినిమాలు చేస్తోన్న కార్తీ ఈ సారి అస్సలు యాక్షన్, ఎలివేషన్ అంశాలు లేకుండా ఫీల్ గుడ్ స్టోరీతో ‘సత్యం సుందరం’ మూవీ చేశారు.
ఈ మూవీ ట్రైలర్ తోనే పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఎమోషనల్ కంటెంట్ తో ‘96’ లాంటి మూవీ చేసి సక్సెస్ కొట్టిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో మరోసారి అలాంటి కథాంశంతోనే ఈ చిత్రం రావడంతో కొంత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడం విశేషం. మంచి ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఒక్క రోజులోనే జరిగిన కథతో ‘సత్యం సుందరం’ మూవీ చేశారు. మూవీలో కార్తీ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి.
‘దేవర’ సినిమాని తట్టుకొని సైతం ఈ మూవీ తెలుగులో మంచి వసూళ్లని అందుకోవడం విశేషం. ఐదు రోజుల్లో ఈ మూవీ నైజాంలో 1.40 కోట్ల షేర్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఏపీలో 1.15 కోట్ల షేర్ అందుకుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఈ మూవీ కలెక్ట్ చేయగా అందులో 2.55 కోట్ల షేర్ ఉండటం విశేషం. తెలుగులో క్లీన్ హిట్ గా నిలవాలంటే మరో 2 కోట్ల షేర్ వసూళ్లు చేస్తే సరిపోతుంది. దసరా ఫెస్టివల్ హాలిడేస్ కలిసి రానున్న నేపథ్యంలో ఈ 2 కోట్ల షేర్ ఈజీగా అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
మరో వైపు వరల్డ్ వైడ్ గా కూడా ‘సత్యం సుందరం’ సినిమాకి మొదటి 6 రోజుల్లోనే అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. తమిళనాడులో 5 రోజుల్లో 16.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో 5.20 కోట్లు, కర్ణాటకలో 2.10 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. కేరళలో 65 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక ఓవర్సీస్ లో 10.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ‘సత్యం సుందరం’ మూవీ వసూళ్లు చేసిందని తెలుస్తోంది. ఓవరాల్ లో 35.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే అందులో 17.25 కోట్ల షేర్ ఉంది. ఈ మూవీ పైన 20 కోట్ల బిజినెస్ వరల్డ్ వైడ్ గా జరిగింది. మరో 4 కోట్ల షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా ఈ మూవీ నిలుస్తుంది.
తమిళనాడు – 16.75 కోట్లు
తెలుగు రాష్ట్రాలు – 5.20 కోట్లు
కర్ణాటక – 2.10 కోట్లు
కేరళ – 0.65 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.45 కోట్లు
ఓవర్సీస్ – 10.25 కోట్లు***
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 35.40 కోట్ల గ్రాస్(17.25 కోట్ల షేర్)