Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్- విజ‌య్ సూప‌ర్ హీరోలు.. ఎందుకో చెప్పిన క‌ట్ట‌ప్ప‌

``ప్ర‌భాస్- విజ‌య్ సూప‌ర్‌మేన్- బ్యాట్‌మేన్ రేంజుకు త‌గ్గ‌రు!`` అని అంటున్నారు `క‌ట్ట‌ప్ప‌` స‌త్యరాజ్. ఆ ఇద్ద‌రు స్టార్లు ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టించారు.

By:  Tupaki Desk   |   6 Jun 2024 12:30 PM GMT
ప్ర‌భాస్- విజ‌య్ సూప‌ర్ హీరోలు.. ఎందుకో చెప్పిన క‌ట్ట‌ప్ప‌
X

``ప్ర‌భాస్- విజ‌య్ సూప‌ర్‌మేన్- బ్యాట్‌మేన్ రేంజుకు త‌గ్గ‌రు!`` అని అంటున్నారు `క‌ట్ట‌ప్ప‌` స‌త్యరాజ్. ఆ ఇద్ద‌రు స్టార్లు ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టించారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేసారు. కానీ ఇప్పుడు వారు ఆ ప‌రిధిని మించిపోయారు. ఇప్పుడు లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల్లో న‌టించాల్సి వ‌స్తోంది. ఆ ఇద్ద‌రూ ఇక‌పై త‌గ్గే ప్ర‌సక్తే లేద‌ని అన్నారు సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌రాజ్.

విజ‌య్-ప్ర‌భాస్ ఇద్ద‌రు హీరోల‌తోను క‌లిసి ప‌ని చేసిన అనుభ‌వం స‌త్య‌రాజ్ కి ఉంది. ప్ర‌భాస్ తో ఇంత‌కుముందు బాహుబ‌లి చిత్రంలో స‌త్య‌రాజ్ న‌టించారు. క‌ట్ట‌ప్ప‌గా అత‌డి న‌ట‌న‌కు జ‌నం జేజేలు ప‌లికారు. బాహుబ‌లిని వెన్నుపోటు పొడిచేవాడిగా, గొప్ప వీరుడిగా క‌నిపించారు స‌త్య‌రాజ్. సినిమా చ‌రిత్ర‌లో బాహుబ‌లిని ఎలా మ‌ర్చిపోలేరో, క‌ట్ట‌ప్పను కూడా అలానే మ‌ర్చిపోలేరు అన్నంత‌గా పాపుల‌ర‌య్యారు.

తాజాగా స‌త్య‌రాజ్ త‌న సినిమా `వెప‌న్` గురించి ప్ర‌చారం చేస్తూ మీడియా స‌మావేశంలో విజ‌య్, ప్ర‌భాస్ గురించి ప్ర‌స్థావించారు. నేటి ప్రేక్ష‌కులు మారారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రు అగ్ర హీరోల‌ను లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల్లో చూడాల‌నుకుంటున్నార‌ని స‌త్యరాజ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇంత‌కుముందు స‌త్య‌రాజ్ త‌లైవా చిత్రంలో విజయ్ తో క‌లిసి న‌టించారు. బాహుబ‌లిలో ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించారు. ఆ సినిమాల్లో ఆయ‌న పాత్ర‌ల‌కు మంచి పేరొచ్చింది. చాలా సినిమాల్లో న‌టించి సీనియ‌ర్లు అయినవారు ఇప్పుడు లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల్లో న‌టించ‌డం స‌రైన‌దేన‌ని స‌త్య‌రాజ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు మార్కెట్ పెరిగింది. వ్యాపార స‌ర‌ళి మారింది. దానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్ర‌భాస్, విజ‌య్ లాంటి న‌టుల అలా మార‌డం స‌హ‌జ‌మేన‌ని అన్నారు.

స‌త్య‌రాజ్ ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్- లోకేష్ క‌న‌గ‌రాజ్ ల `కూలీ`లో న‌టిస్తున్నారు. 40 సంవత్సరాల గ్యాప్ తర్వాత రజనీకాంత్‌తో క‌లిసి స‌త్య‌రాజ్ తెరను పంచుకుంటాడు. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో AR మురుగదాస్ తెర‌కెక్కిస్తున్న సికంద‌ర్ లోను స‌త్య‌రాజ్ న‌టిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.