ఇండియా హౌజ్ 'సతి'.. చాలా స్పెషల్..!
నిఖిల్ ది ఇండియా హౌజ్ లో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అమ్మడి బర్త్ డే కానుకగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 24 Dec 2024 1:21 PM GMTకార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ తన నెక్స్ట్ సినిమాను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. నిఖిల్ హీరోగా రామ్ వంశీకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ది ఇండియా హౌజ్. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా ప్చర్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్, విక్రం రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా కథానాయిక పోస్టర్ రిలీజ్ చేశారు.
నిఖిల్ ది ఇండియా హౌజ్ లో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అమ్మడి బర్త్ డే కానుకగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సయి మంజ్రేకర్ సతి పాత్రలో నటిస్తున్నారు. ది ఇండియా హౌజ్ ఫస్ట్ లుక్ లో సంప్రదాయ లుక్ తో శారీ, ఒంటి మీద నగలతో సయి మంజ్రేకర్ లుక్ అదిరిపోయింది.
1905 నేపథ్యలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా అనౌన్స్ మెంట్ రోజు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా అప్పటికే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. సినిమాలో అనుపమ్ ఖేర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ది ఇండియా హౌజ్ సినిమా తో మరోసారి నిఖిల్ పాన్ ఇండియా హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. సినిమా నుంచి సతి పొస్టర్ రిలీజ్ కాగా త్వరలోనే సినిమా నుంచి మరో టీజర్ రాబోతుందని తెలుస్తుంది.
కార్తికేయ 2 తర్వాత ఒకటి రెండు ప్రయత్నాలు చేసిన నిఖిల్ మళ్లీ ది ఇండియా హౌస్ తోనే పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా విజువల్స్ కూడా ప్రత్యేకంగా నిలిచేలా ఉన్నాయి. ఈ సినిమా విషయంలో ప్రతి అప్డేట్ వెరైటీగా ప్రమోట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాం చరణ్ ప్రెజెంటర్ గా రాబోతున్న మొదటి సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఐతే సినిమా గురించి చాలా తక్కువ అప్డేట్స్ బయటకు వస్తుండగా టీజర్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరుగుతుందని అంటున్నారు మేకర్స్.