Begin typing your search above and press return to search.

జీబ్రా రివ్యూస్.. సత్యదేవ్ కామెంట్స్ వైరల్..

తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సినిమాకు మంచి రెస్పాన్స్ అందిస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

By:  Tupaki Desk   |   24 Nov 2024 12:32 PM GMT
జీబ్రా రివ్యూస్.. సత్యదేవ్ కామెంట్స్ వైరల్..
X

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్.. రీసెంట్ గా జీబ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హైలీ యాంటిసిపేటరీ మల్టీస్టారర్ గా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో కన్నడ స్టార్ డాలీ ధనుంజయ ముఖ్య పాత్ర పోషించారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌ గా నటించారు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్‌ ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు.

జీబ్రా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్.. ఆడియన్స్ లో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మూవీ విడుదలయ్యాక మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మనీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఆ మూవీ.. అందరినీ ఆకట్టుకుంటోంది. సూర్య పాత్రలో సత్యదేవ్ చక్కగా ఒదిగిపోయారని అంతా కొనియాడుతున్నారు. సినిమా అంతా ఆకట్టుకున్నారని చెబుతున్నారు. సినిమాకు తనవంతు న్యాయం చేశారని రివ్యూస్ ఇస్తున్నారు.

అయితే మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుండడంతో మేకర్స్.. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సినిమాకు మంచి రెస్పాన్స్ అందిస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. జీబ్రాతో మనిషిగా రాటుదేలానని సత్యదేవ్ తెలిపారు. తనలో చాలా మార్పు వచ్చినట్లు చెప్పారు. ఇదివరకు స్టేజ్ పై మాట్లాడాలంటే భయమేసిందని చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చాలా థియేటర్లు సందర్శించానని వెల్లడించారు.

అదే సమయంలో పలు వ్యాఖ్యలు చేశారు. "ఎవరినీ ఉద్దేశించి కాకుండా కొంత మాట్లాడుతాను. జీబ్రాకు 80 శాతం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. 95 కాదు.. 80 అనుకుందాం.. 20 శాతం నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. అది కూడా చాలా నెగిటివ్ ఉంది. 80 శాతం చాలా పాజిటివ్ ఉంది. మేం సినిమాలు జనాల కోసమే చేస్తున్నాం. మీరు రివ్యూస్ జనాల కోసం ఇస్తున్నారు. మేం 80 శాతం జనాలకు దగ్గరగా ఉన్నాం. మీరు 20 శాతం జనాలకు దగ్గరగా ఉన్నారు" అని తప్పుడు రివ్యూస్ ఇస్తున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అదే సమయంలో తాను పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పారు. జీబ్రా వంటి చిత్రాల విషయంలో బ్లఫ్ మాస్టర్ మూవీ విషయం గుర్తొస్తుంటుందని తెలిపారు. ఆ సినిమా మంచి హిట్ అవుతుందని అనుకుంటే.. ఫస్ట్ డే నిరాశపరిచిందని చెప్పారు. దాని నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టిందని అన్నారు. జీబ్రా వంటి సినిమాలు ఓటీటీలో సూపర్‌ హిట్‌ అవుతాయని చాలామంది అంటున్నారని ప్రస్తావించారు.

కానీ ఓటీటీలో అదరగొడితే ఏం లాభమని అన్నారు. అయితే డైరెక్టర్ ఈశ్వరన్ తనను స్టార్ హీరో అనుకుని సినిమా తీశాడని తెలిపారు. ఓ రివ్యూలో తెలుగు డైరెక్టర్ అయితే మూవీ ఇంకా బాగా తీసేవాడని రాశారని చెప్పారు. అప్పుడు తనకు చాలా బాధ కలిగిందని తెలిపారు. తెలుగు రాకపోయినా నేర్చుకుని మరీ ఆయన సినిమా చేశాడన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌ కు 500కిపైగా సార్లు ప్రయాణించాడని గుర్తు చేశారు. ప్రస్తుతం సత్యదేవ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.