కమెడియన్ సత్య.. పోటీ మాత్రం గట్టిగానే..
ఇక తాజాగా వచ్చిన మత్తు వదలరా2 సినిమాలో సత్య చేసిన క్యారెక్టర్ హైలైట్ గా నిలిచింది. తన క్యారెక్టరైజేషన్ తో ఫుల్ కామెడీ పండించి మూవీ మొత్తాన్ని నడిపించాడనే మాట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 14 Sep 2024 4:07 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్స్ గురించి మాట్లాడుకుంటే అందులో సత్య పేరు కచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది. శ్రీ సింహ, సత్య, ఫరియా అబ్దుల్లా మెయిన్ లీడ్ లో వచ్చిన మత్తు వదలరా 2 సినిమా ఫుల్ ఫన్ రైడ్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో సత్య తన కామెడీతో వన్ మ్యాన్ షో చేశాడనే మాట వినిపిస్తోంది. సినిమా ఆధ్యంతం అతని క్యారెక్టర్ నవ్విస్తూనే ఉంటుందంట. ఈ సినిమాతో సత్య కమెడియన్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయినట్లు ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
2009లో సత్య నటుడిగా కెరియర్ స్టార్ట్ చేశాడు. అయితే అతనికి ఫస్ట్ బ్రేక్ రావడానికి నాలుగేళ్లు పట్టింది. 2013 లో వచ్చిన స్వామి రారా సినిమాతో కమెడియన్ గా సత్యకి కొంత ఫేమ్ వచ్చింది. అక్కడి నుంచి గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. ఏడాదికి ఎనిమిది నుంచి పది సినిమాలలో సత్య కమెడియన్ గా తనదైన స్టైల్ లో సందడి చేస్తున్నాడు. సత్య క్యారెక్టర్ ఉందంటే కచ్చితంగా ఫన్ జనరేట్ అవుతుందనే అభిప్రాయం మేకర్స్ లో ఉంది. అందుకే అతని ఏరి కోరి మరి సినిమాలలో తీసుకుంటున్నారు.
ఇక తాజాగా వచ్చిన మత్తు వదలరా2 సినిమాలో సత్య చేసిన క్యారెక్టర్ హైలైట్ గా నిలిచింది. తన క్యారెక్టరైజేషన్ తో ఫుల్ కామెడీ పండించి మూవీ మొత్తాన్ని నడిపించాడనే మాట వినిపిస్తోంది. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ అంటే బ్రహ్మానందం పేరు వినిపించేది. తర్వాత సునీల్ స్టార్ కమెడియన్ గా దశాబ్ద కాలం పాటు తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేశాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్ గా టాలీవుడ్ లో ఉన్నారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, అభినవ్ గోమటం కమెడియన్స్ గా రాణిస్తున్నారు. కానీ స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేదు. ప్రియదర్శి ఈ మధ్య హీరోగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు.
జబర్దస్త్ కమెడియన్స్ అవకాశాలు అందుకుంటున్న కూడా ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్ చేసుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో సునీల్ తర్వాత ఆ లోటును భర్తీ చేసే రేంజ్ లో సత్య కామెడీ ఉందనే మాట వినిపిస్తోంది. వెన్నెల కిషోర్ కి దీటుగా సత్య కూడా స్టార్ కమెడియన్ గా టాలీవుడ్ లో ఇప్పుడు రేస్ లో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల సినిమాలలో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. మరోవైపు కామెడీ కథలతో వచ్చే చిన్న సినిమాలకు కూడా సత్య ఫస్ట్ ఛాయిస్ అవుతున్నాడు.
దీనిని బట్టి సత్య ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది రిలీజ్ అయిన చిన్న సినిమాలలో ఎక్కువగా కామెడీ కంటెంట్ తో వచ్చినవే సక్సెస్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తక్కువ బడ్జెట్ మూవీస్ చేయాలనుకుంటే కచ్చితంగా కామెడీ జోనర్ కథలని చెప్పే ప్రయత్నం చేస్తారనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే చాలామంది దర్శకులు ఎంటర్టైన్మెంట్ కథలతో ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరూ కూడా సత్యని తమ సినిమాల్లో తీసుకోవాలని అనుకుంటున్నారు. సత్య ఉంటే ఖచ్చితంగా సినిమాకి పాజిటివ్ వైబ్ వస్తుందని బలంగా నమ్ముతున్నారు.