Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ సినిమాలో మరో హీరో.. విలనా?

తాజాగా ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. సత్యదేవ్ ఇటీవలే కృష్ణమ్మా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

By:  Tupaki Desk   |   30 May 2024 2:30 PM GMT
విజయ్ దేవరకొండ సినిమాలో మరో హీరో.. విలనా?
X

విజయ్ దేవరకొండ తన కెరీర్ లో మరింత వేగం పెంచాడు. ఫ్యామిలీ స్టార్ సినిమాతో అనియకున్నంత రేంజ్ లో సక్సెస్ చూడలేకపోయిన విజయ్ , ఇప్పుడు సక్సెస్ జోరును కొనసాగించేందుకు పలు ప్రాజెక్టులు లైన్లో పెట్టారు. గ్యాప్ ఇవ్వకుండా మూడు సినిమాలను వెంటవెంటనే ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

విజయ్ రాబోయే సినిమాలు గతంలో కంటే భిన్నంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. యాక్షన్, మిస్టరీ థ్రిల్ల్స్ తో కూడిన కథలను ఎంపిక చేస్తూ, ఎమోషన్ ని కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పీరియాడిక్ స్పై యాక్షన్ జానర్ లో ఉండబోతుంది. ఇటీవలే వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది.

సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే, మొదట శ్రీలీలని ఎంపిక చేసినప్పటికీ, ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాక, ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. శ్రీలీల ప్లేస్ లో మమిత బైజు, భాగ్యశ్రీ భోర్సే వంటి పలు పేర్లు వినిపించినప్పటికీ, హీరోయిన్ ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. సత్యదేవ్ ఇటీవలే కృష్ణమ్మా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం హీరోగా పలు సినిమాల్లో బిజిగా ఉన్న సత్యదేవ్, గతంలో విలన్ పాత్రలు చేసినా, ఇప్పుడు మరోసారి విలన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి అంగీకరించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కథ బలంగా ఉండి తన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇక విజయ్ సినిమాలో అతను ఎలాంటి పాత్రకు ఒప్పుకున్నాడో తెలియాల్సి ఉంది అధికారిక ప్రకటన వెలువడేవరకు దీనిపై స్పష్టత రానట్టే.

ఇక విజయ్, టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ తో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో రూపొందే ఈ సినిమాకు దాదాపు 200 కోట్లు బడ్జెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఈ కథలో విజయ్ రెండు క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది.