ప్రభాస్‌ను దాటేసిన కార్తి
ఇందులో కూడా కార్తి చిత్రానికి ఎవరూ ఊహించని రీతిలో భారీ స్థాయిలో రెస్పాన్స్ సొంతం అయింది.
By: Tupaki Desk | 1 Nov 2024 8:18 AM GMTసౌత్ ఇండియా మొత్తంలో ఎంతో మంది హీరోలు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను ఏర్పరచుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సూర్య తమ్ముడు కార్తి ఒకడు. నేచురల్ యాక్టింగ్‌తో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అయితే, ఈ మధ్యన సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో కార్తి నటించిన లేటెస్ట్ మూవీనే ‘సత్యం సుందరం’.
కోలీవుడ్ స్టార్ కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ‘సత్యం సుందరం’. సీ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో పూర్తి స్థాయి కుటుంబ కథతో రూపొందిన ఈ ఎమోషనల్ మూవీకి పాజిటివ్ మౌత్ టాక్ లభించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి తమిళం, తెలుగులో కూడా ఆడియెన్స్ నుంచి విశేషమైన స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న తమిళ స్టార్ కార్తి హీరోగా నటించిన ‘సత్యం సుందరం’ మూవీ థియేటర్లలో మంచి ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే దీన్ని ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ ఎమోషనల్ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో కూడా కార్తి చిత్రానికి ఎవరూ ఊహించని రీతిలో భారీ స్థాయిలో రెస్పాన్స్ సొంతం అయింది.
కార్తి హీరోగా నటించిన ‘సత్యం సుందరం’ మూవీకి నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా ఇది మొదటి వారంలోనే 1.9 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఎక్కువ మంది వీక్షించిన ఇండియన్ సినిమాల్లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ (1.7 మిలియన్స్), సలార్ హిందీ (1.6 మిలియన్స్) చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది.
ఓటీటీల్లో మొదటి వారంలో అత్యధిక వ్యూస్ సాధించిన ఇందులో ‘కల్కి 2898 ఏడీ’ హిందీ వెర్షన్ 4.5 మిలియన్ వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం’ 3.8 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో, ‘గుంటూరు కారం’, ‘హాయ్ నాన్న’ 2 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో నిలిచాయి.
‘సత్యం సుందరం’ సినిమాకు ఓటీటీలో సైతం ప్రశంసల వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో కార్తి, అరవింద స్వామి నటనకు ఓ రేంజ్‌లో ప్రశంసలు వచ్చాయి. ఇక, ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య నిర్మించారు. ఇందులో రాజ్ కిరణ్, శ్రీ దివ్య, దేవ దర్శిణి తదితరులు నటించారు.