50 సినిమాలొదిలేసిన నటుడీయన!
వాస్తవానికి రాజేష్ నటుడిగా విభిన్న పాత్రలు పోషించాడు. కానీ కమెడియన్ గానే ఎక్కువగా హైలైట్ అయ్యాడు. ఆ తరహా పాత్రలు రావడంతో చాలా కాలం అలాగే కొనసాగాడు.
By: Tupaki Desk | 18 April 2024 1:30 AM GMT'పొలిమేర-2' విజయంతో సత్యం రాజేష్ పేరు మారు మ్రోగిపోతోన్న సంగతి తెలిసిందే. పరిమిత బడ్జెట్ లో చేసిన ఈ సినిమా భారీగా వసూళ్లని సాధించింది. దీంతో నటుడిగా అతనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ఒకప్పుడు కేవలం కామెడీ పాత్రలకే పరిమితమైన రాజేష్ ఇప్పుడు సీరియస్ రోల్స్ సైతం చేయగల నటుడని ఇండస్ట్రీ విశ్వసిస్తుంది. అతనితో పొలిమేర-3 కూడా ప్లాన్ చేస్తున్నారు. అది పాన్ ఇండియాలో ఉంటుందని ప్రచారం సాగుతుంది.
వాస్తవానికి రాజేష్ నటుడిగా విభిన్న పాత్రలు పోషించాడు. కానీ కమెడియన్ గానే ఎక్కువగా హైలైట్ అయ్యాడు. ఆ తరహా పాత్రలు రావడంతో చాలా కాలం అలాగే కొనసాగాడు. అయితే ఇప్పుడా సేఫ్ జోన్ నుంచి బయటకొచ్చి సినిమాలు చేస్తున్నాడు. 'క్షణం'లో పోలీస్ పాత్ర మంచి గుర్తింపునిచ్చింది. ఈ పాత్ర అతడి కెరీర్ కి కొత్త టర్నింగ్ పాయింట్ లా నిలిచింది. తాజాగా ఆ సినిమా తర్వాత ఏకంగా 50 సినిమా అవకాశాలు వదులుకున్నట్లు రివీల్ చేసాడు. పోలీస్ పాత్ర సక్సెస్ అవ్వడంతో మళ్లీ పోలీస్ పాత్రలే వచ్చాయట.
కామెడీ చేసే పోలీసు పాత్రలకు కాకుండా సీరియస్ గా ఉండే పోలీస్ పాత్రలు వస్తే చేయాలని ఉందని మనసులో కోర్కెను బయట పెట్టాడు. ప్రకాష్ రాజ్..రఘువరన్ లా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలని ఉందన్నాడు. మొత్తానికి రాజేష్ ఇంతకాలం లోపలే దాచుకున్న ఎమోషన్ అంతా బయటకు తెచ్చే సమయం వచ్చింది. అందుకే ఇలా ఓపెన్ అవుతున్నాడు. నటుడిగా అతడు ఎలాంటి పాత్రలైనా పోషించగల సామర్ధ్యం ఉన్నవాడు.
కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన అదే తరహా పాత్రలో అవకాశం వచ్చినప్పుడు సీరియస్ ఎక్స్ ప్రెషన్స్ తోనూ మెప్పించిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ దర్శకులు అతడిలో కమెడియన్ ని చూసారు తప్ప! సీరియస్ యాంగిల్ ని టచ్ చేయలేదు. అది పోలిమేర్ తో ప్రూవ్ అయింది. ఆ సినిమా దర్శకుడు పొలిమేర చిత్రంలో రాజేష్ సీరియస్ రోల్ పోషిస్తే ఎలా ఉంటుందో? అతడి నట ఉగ్ర రూపం ఎలా ఉంటుందో రెండవ భాగంలో హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. మూడవ భాగాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రాజేష్ నటించిన 'టెనెంట్' అనే చిత్రం రిలీజ్ అవుతుంది.