బెట్టింగ్ యాప్ స్కాం.. రణబీర్ ఆ పెళ్లికి వెళ్లలేదు కానీ..!
దుబాయ్‌లో జరిగిన ప్రధాన నిందితుల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్ వివాహానికి రణ్‌బీర్ కపూర్ హాజరు కానప్పటికీ, మహాదేవ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్నందున అతడు ED పరిశీలనలో ఉన్నాడు.
By: Tupaki Desk | 8 Oct 2023 3:20 AM GMTమహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవ్వాలంటూ సమన్లు అందుకున్న రణబీర్ కపూర్, ఏజెన్సీ ముందు హాజరు కావడానికి రెండు వారాల గడువును కోరారు. కానీ ఈ శుక్రవారం ఉదయం అతడు ఇవేవీ పట్టనట్టుగా రిలాక్స్ డ్ గా ముంబైలో ఓ క్లినిక్ కి వెళ్లి వస్తూ కనిపించాడు.
రణబీర్ క్లినిక్ బయట కనిపించగా.. కెమెరామెన్లు అతడిని అనుసరించారు. ఫోటోలు తీసారు. అయితే ఆ సమయంలో రణబీర్ ''పీచా మత్ కర్ణా'' అని అన్నాడు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో ప్రమేయం ఉందని ED సమన్లు పంపిన తర్వాత రణబీర్ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. కపూర్ సన్ రణబీర్ మహాదేవ్ యాప్‌ను వర్చువల్ (ఆన్‌లైన్) స్పేస్‌లో ప్రమోట్ చేశారని ఆరోపించారు.
రణ్‌బీర్ కపూర్‌కి ఈడీ ఎందుకు సమన్లు పంపింది?
దుబాయ్‌లో జరిగిన ప్రధాన నిందితుల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్ వివాహానికి రణ్‌బీర్ కపూర్ హాజరు కానప్పటికీ, మహాదేవ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్నందున అతడు ED పరిశీలనలో ఉన్నాడు. ఒక సోర్స్ ప్రకారం రణబీర్ అందుకున్న చెల్లింపు విధానం గురించి అధికారులు అతనిని ప్రశ్నించాలనుకుంటున్నారు.
ED స్కానర్ కింద బాలీవుడ్ ప్రముఖులు కోట్లాది రూపాయల మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో ప్రధాన నిందితుల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్, ఫిబ్రవరి 2023లో దుబాయ్‌లో జరిగిన తన వివాహానికి హాజరైన ప్రముఖులకు చెల్లింపులను నిర్వహించడానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పారని సమాచారం. టైగర్ ష్రాఫ్, అలీ అస్గర్, విశాల్ దద్లానీ, నేహా కక్కర్, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, సన్నీ లియోన్, భాగ్యశ్రీ, పుల్కిత్ సామ్రాట్, కృతి ఖర్బండా, నుష్రత్ భరుచ్చా, కృష్ణ అభిషేక్, అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్ చంద్రకర్ వివాహానికి హాజరయ్యారు. ఈ పెళ్లికి రూ.260 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.
వీళ్లంతా ఎక్కడి వారు? ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన సౌరభ్ చంద్రకర్- రవి ఉప్పల్ మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు ప్రధాన ప్రమోటర్లు. కోట్లాది రూపాయల కుంభకోణానికి సంబంధించి వారు ఈడీ స్కానర్‌లో ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి శ్రద్ధా కపూర్, హీనా ఖాన్, కపిల్ శర్మ, హుమా ఖురేషీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. దర్యాప్తు సమయంలో, పెద్ద మొత్తంలో నేరారోపణలను నిరూపించే సాక్ష్యాలు కనుగొన్నారని సమాచారం. ED శుక్లాకి చెందిన రూ. 417 కోట్ల విలువైన నేరపూరిత ధనాన్ని స్తంభింపజేసింది.