డాక్టర్ గెటప్ లో హర్భజన్ సింగ్ ఈసారి కొట్టేలా!
అయితే అవన్నీ స్పెషల్ అప్పిరియన్స్ మాత్రమే. హీరోగా మాత్రం 2021లో ఓ సినిమా చేసాడు.
By: Tupaki Desk | 6 Nov 2024 8:57 AM GMTమాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ ఇప్పుడు నటుడిగా సక్సెస్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. హిందీ, పంజాబీ, తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే అవన్నీ స్పెషల్ అప్పిరియన్స్ మాత్రమే. హీరోగా మాత్రం 2021లో ఓ సినిమా చేసాడు. అదే ప్రెండ్ షిప్. దీన్ని జాన్ పాల్ రాజ్ తెరకెక్కించాడు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకూ హీరోగా సినిమా చేయలేదు. తాజాగా `సేవియర్` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో స్పిన్నర్ కి జోడీగా ఓవియో నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని కూడా హర్భజన్ సింగ్ తొలి సినిమాకి దర్శకత్వం వహించిన జాన్ పాల్ రాజ్ నే తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ లుక్ లోకి వెళ్తే అమ్మోరు తల్లి వర్ణ పాత్రలో ఓవియా నటిస్తోంది. డాక్టర్ జేమ్స్ మల్హోత్రా పాత్రలో హర్భజన్ సింగ్ నటిస్తున్నాడు. అలాగే జిబి ముత్తు- గణేశన్ పాత్రలు కూడా రివీల్ చేసాడు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇది పిల్లి-ఎలుక గేమ్ నేపథ్యంలో సాగే స్టోరీ.
ఒక రాత్రిలో జరిగే 12 హత్యలు చుట్టూ కథ తిరుగుతుంది. ఫస్ట్ లుక్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉంది. రెండు పాత్రలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. క్రైమ్ స్టోరీలు...థ్రిల్లర్ చిత్రాలు చేయడంలో తమిళ్ డైరెక్టర్లు స్పెషలిస్ట్ లు. ఈ మధ్య కాలంలో ఆ తరహా కథలకు మంచి డిమాండ్ ఉంటుంది. హిట్ తప్ప ప్లాప్ అనే మాట లేదు. సక్సెస్ రేట్ బాగుం టుంది. ఈ నేపథ్యంలో సేవియర్ పైనా అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి.
హర్బజన్ సింగ్ కి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. కానీ సరైన కథ పడకపోవడంతో అతడి ట్యాలెంట్ కిల్ అవుతుంది. మరి సేవియర్ రూపంలో బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూడాలి. ప్రెండ్ షిప్ తర్వాత మరోసారి అదే దర్శకుడిని ఎంపిక చేసుకుని ఈ సినిమా చేస్తున్నాడు. ఓవియా బిగ్ బాస్ తో బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. అయితే ఆ మధ్య కొన్ని వివాదాల్లో అమ్మడి పేరు వినిపించ డంతో జోరు కాస్త తగ్గినట్లు అనిపించింది.