Begin typing your search above and press return to search.

పేద‌రాలైన స‌న్నీలియోన్‌కు నెల‌కు 1000 ప్ర‌భుత్వ ప‌థ‌కం

ఓ వ్యక్తి మాజీ శృంగార‌ నటి సన్నీ లియోన్ పేరు మీద ఖాతా తెరిచి ప్ర‌తినెలా రూ. 1000 ప్ర‌భుత్వం నుంచి తీసుకుంటున్నట్లు అధికారులు క‌నుగొన్నారు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 8:30 AM GMT
పేద‌రాలైన స‌న్నీలియోన్‌కు నెల‌కు 1000 ప్ర‌భుత్వ ప‌థ‌కం
X

ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఘ‌రానా మోసం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివాహిత మహిళలకు పథకం కింద 'సన్నీ లియోన్' పేరుతో నెలకు వెయ్యి రూపాయ‌లు ఒక వ్య‌క్తి ఖాతాలో జ‌మ అవుతోంద‌ని అధికారులు క‌నుగొన్నారు. ఈ మోసం కాస్త ఆల‌స్యంగా బ‌ట్ట‌బ‌య‌లైంది. ఓ వ్యక్తి మాజీ శృంగార‌ నటి సన్నీ లియోన్ పేరు మీద ఖాతా తెరిచి ప్ర‌తినెలా రూ. 1000 ప్ర‌భుత్వం నుంచి తీసుకుంటున్నట్లు అధికారులు క‌నుగొన్నారు. వివాహిత మహిళల కోసం ప్రభుత్వ పథకం కింద ఈ మొత్తం అత‌డి ఖాతాలో జ‌మ అవుతోంది.

బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామంలో ఈ మోసం జరిగినట్లు సమాచారం. ఈ విషయంపై క్షుణ్ణంగా విచారణ జరిపి డబ్బుల రికవరీ కోసం బ్యాంకు ఖాతాను సీజ్ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను జిల్లా కలెక్టర్ కోరారు. స్థానికంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహతారీ వందన్ యోజన' ద్వారా వివాహిత మహిళలకు ప్రతినెలా రూ.1,000 అందజేస్తోంది. ప్ర‌స్తుతం అస‌లైన లబ్ధిదారులెవరో నిర్ధారించే బాధ్యతను అధికారులు తీసుకున్నారు. అయితే ఈ కేసు య‌థావిధిగా రాజకీయ దుమారానికి తెర‌తీసింది.

స‌న్నీలియోన్ పేద‌రాలా?

బాలీవుడ్ లో క‌థానాయిక‌గా, ఐట‌మ్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగిన స‌న్నీలియోన్ ఒక్కో ప్రాజెక్టుతో కోట్ల‌లో ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాల్లో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల పోస్టింగుల ద్వారానే ల‌క్ష‌ల్లో ఆర్జిస్తోంది. సౌంద‌ర్య పోష‌కాలైన‌ ఉత్ప‌త్తుల కంపెనీని స్థాపించిన‌ స‌న్నీలియోన్ ఎంట‌ర్ ప్రెన్యూర్ గాను భారీగా ఆర్జిస్తోంది. అయితే ధ‌నికురాలైన స‌న్నీలియోన్ పేరును ఉప‌యోగించి ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని దుర్వినియోగం చేయ‌డం తీవ్ర దుమారం రేపుతోంది.