Begin typing your search above and press return to search.

స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ .. వీడు మామూలోడు కాదు!

`స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ`కి అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ఈ సిరీస్ లో స‌రికొత్త స్కామ్ క‌థ సిద్ధ‌మ‌వుతోంద‌ని ప్ర‌క‌టించారు. మెహ‌తా స్కామ్ ని మించి ఉత్కంఠ రేకెత్తించే స్కామ్ తో సీజ‌న్ 2 తెర‌కెక్క‌నుంద‌ని వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   6 Aug 2023 4:19 AM GMT
స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ .. వీడు మామూలోడు కాదు!
X

`స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ`కి అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ఈ సిరీస్ లో స‌రికొత్త స్కామ్ క‌థ సిద్ధ‌మ‌వుతోంద‌ని ప్ర‌క‌టించారు. మెహ‌తా స్కామ్ ని మించి ఉత్కంఠ రేకెత్తించే స్కామ్ తో సీజ‌న్ 2 తెర‌కెక్క‌నుంద‌ని వెల్ల‌డించారు. ఎట్ట‌కేల‌కు కొత్త‌ సీజన్‌ టీజర్ శుక్రవారం విడుద‌లైంది. టీజర్ మనోజ్ బాజ్‌పేయి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమవుతుంది. ఇది 1992 నాటి ఇండియన్ స్టాక్ మార్కెట్ 5000 కోట్ల‌ స్కామ్ క‌థ కంటే ఐదు రెట్లు పెద్ద స్కామ్‌. ఎంతో ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ అతి భారీ స్కామ్ స్టోరి ఇది. ఒక పండ్లు అమ్ముకునే కుర్రాడు అబ్దుల్ కరీం తెల్గీ రూ. 30,000 కోట్ల కుంభకోణానికి ఎలా పాల్ప‌డ్డాడు? అన్న‌దే ఈ సిరీస్ క‌థాంశం. తెల్గీ నకిలీ స్టాంపు పేప‌ర్లు, నకిలీ పాస్‌పోర్ట్‌లను తయారు చేయడం ద్వారా తన నేర‌పూరితమైన‌ వృత్తిని ప్రారంభించాడు.

అతడు సౌదీ అరేబియాకు మానవ వనరులను ఎగుమతి చేసే వ్యాపారాన్ని ప్రారంభించాడు. దానికోసం ఒక కంపెనీని ప్రారంభించాడు. అతడు పాస్‌పోర్ట్‌లో ఎమిగ్రేషన్ చెక్ కోసం అవసరమైన స్టాంప్ లేదా ఇమ్మిగ్రేషన్ అధికారులతో చిక్కుల‌ను తొల‌గించేందుకు.. విమానాశ్రయంలో కార్మికులు సాఫీగా లోనికి వెళ్లడానికి అనేక నకిలీ పత్రాల(డాక్యుమెంట్ల‌)ను సృష్టించేవాడు. నకిలీ స్టాంప్ పేపర్‌ను తయారు చేయడంలో విజ‌యం సాధించ‌డ‌మే గాక‌ తెల్గీ మరింత సంక్లిష్టమైన నకిలీల సృష్టిక‌ర్త‌గా మారాడు. అతడు బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు సహా బల్క్ కొనుగోలుదారులకు నకిలీ డాక్యుమెంట్ల‌ను విక్రయించే ఏజెన్సీగా మారాడు. 300 మందిని త‌న‌ ఏజెంట్లుగా నియమించుకున్నాడు.

టీజర్‌లోని “పైసా కామయా నహీ బనాయా జాతా హై” అనే డైలాగ్ మీమ్స్‌లో వైరల్ అవుతోంది. అయితే, టీజర్ ఆద్యంతం టైటిల్ పాత్రధారి ముఖాన్ని చూపించ‌లేదు. రెండవ సీజన్‌లో అచింత్ ఠక్కర్ రూపొందించిన సిగ్నేచర్ సౌండ్‌ట్రాక్ ఆస‌క్తిని క‌లిగించింది. అతడు స్ట్రీమింగ్ ఫిల్మ్ `మోనికా, ఓ మై డార్లింగ్` సౌండ్‌ట్రాక్‌ను కూడా కంపోజ్ చేశాడు. `స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ`కి తుషార్ హీరానందాని దర్శకత్వం వహించగా, హన్సల్ మెహతా షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. గగన్ దేవ్ రిరార్ అబ్దుల్ కరీం తెల్గీ టైటిల్ రోల్‌లో నటించారు. ఈ సిరీస్‌ను స్టూడియో నెక్స్ట్‌తో కలిసి అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.. ఈ సిరీస్ సెప్టెంబర్ 2 నుండి సోనీ ఎల్‌ఐవిలో ప్రసారం కానుంది.