అనుపమ గ్లామర్ టింజ్ పెరగడానికి కారణం?
మొదటి భాగం కంటే రెండో భాగంలో గ్లామర్ రొమాన్స్ డోస్ మరింత ఎక్కువైందని అంతా అంటున్నారు.
By: Tupaki Desk | 18 March 2024 5:50 PM GMTడిజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ ప్రచార చిత్రాలు ఇప్పటికే యూత్ కి కనెక్టయిపోయాయి. మొదటి భాగం కంటే రెండో భాగంలో గ్లామర్ రొమాన్స్ డోస్ మరింత ఎక్కువైందని అంతా అంటున్నారు. ఇదే విషయయాన్ని తాజా ప్రచార వేదికలో జర్నలిస్టులు ప్రశ్నించారు.
పార్ట్ 2లో గ్లామర్ టింజ్ ఎక్కువగా కనిపిస్తోంది. టిల్కు స్క్వేర్ తో అనుపమలో అందం యాడైందనిపించింది అని ఒక జర్నలిస్టు ప్రశ్నించగా.. అనుపమ ఫుల్ గా చిల్ అయింది. గ్లామర్ అంటే నేను చాలా అందంగా ఉన్నానని అంటున్నారా? మంచిదే కదండీ.. అందంగా ఉంటే..! అని మురిసిపోయింది అనుపమ.
సిద్ధు వల్లే అనుపమ ఇలా మారిపోయింది? అంటున్నారు అని ఒక జర్నలిస్టు సరదాగా వ్యాఖ్యానించగా..మంచిదే కదండీ.. మీరు గ్లామరస్ అంటున్నారు.. అందంగా ఉన్నానంటున్నారు. థాంక్స్ సిద్ధూ..! అంటూ సిద్ధూకి ధన్యవాదాలు తెలిపింది. టిల్లు స్క్వేర్ పోస్టర్లు, ప్రచార చిత్రాల్లో అనుపమ చాలా స్పెషల్ గా గ్లామరస్ గా కనిపిస్తోందని కితాబు అందిన మాట వాస్తవం.
చాలా ప్రత్యేకమైనది:
ఇది నా కెరీర్లో చేసిన మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు.. నేను మూడేళ్ల నుంచి ప్రయోగాలు చేస్తున్నాను అని అనుపమ అన్నారు. అప్పటివరకూ నేను చేసినవి ఇష్టమైనవే కానీ, కొన్ని పరిమితుల వల్ల ఎక్కువగా నటిగా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఒక మంచి పాత్రను ఈ సినిమాలో చేసాను. చాలా గర్వించదగిన పాత్ర ఇది.. అని అనుపమ తెలిపింది.