Begin typing your search above and press return to search.

'తార‌క్ 1422' ర‌హస్యం వీడిందిలా!

1422 వెనుక చాలా పెద్ద సెంటిమెంట్ ఉంద‌ని తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్ - భార్గవ్ రామ్ పుట్టిన రోజులను స్మరించుకుంటుంది.

By:  Tupaki Desk   |   22 April 2024 9:08 AM GMT
తార‌క్ 1422 ర‌హస్యం వీడిందిలా!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇంట కారు ఉందంటే? ఆ నెంబ‌ర్ సిరీస్ 9999 గా ఉండాల్సిందే. ఈ నెంబ‌ర్ ని ఆయ‌న సెంటిమెంట్ గా భావిస్తారు. ఎలాంటి కారు కొనుగోలు చేసినా ఇదే నెంబ‌ర్ ప్యాన్సీ నెంబ‌ర్ ఉండేలా చూసుకుంటారు. అత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరస్‌తో సహా అతని ప్రతి కారులో 9999 సిరీస్ నంబర్ త‌ప్ప‌క ఉంటుంది. ఆ నెంబ‌ర్ తో కారు క‌నిపించిందంటే? అభిమానుల‌కు ఓ ఐడెంటిటీ. ఆ నంబ‌ర్ కారు క‌నిపిస్తే అందులో తార‌క్ ఉన్నాడ‌ని తొంగి చూస్తారు. ఆ నెంబ‌ర్ కి అంత‌టి ప్ర‌త్యేక‌త ఉంది.

ఇటీవ‌లే కొత్తగా మెర్సిడెస్ బెంజ్ సెడాన్ కారును కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈకారుకి మాత్రం 9సిరీస్ లేదు కొత్తగా 1422 రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉంది ఆ కారు. 9999 స్థానంలో కొత్త‌గా ఆ నెంబ‌ర్ ఏంటి? అని అంతా ఆశ్చ‌ర్యపోతున్నారు. అది కూడా నాన్-ఫ్యాన్సీ నెంబ‌ర్ కావ‌డంతో ఏమైంది? అనే చ‌ర్చ నెట్టింట జోరుగా సాగుతుంది. 1422 వెనుక చాలా పెద్ద సెంటిమెంట్ ఉంద‌ని తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్ - భార్గవ్ రామ్ పుట్టిన రోజులను స్మరించుకుంటుంది.

అభయ్ రామ్ 22 జూలై 2014న జన్మించగా- భార్గవ్ 14 జూన్ 2018న జన్మించారు. అలా ఇద్ద‌రి నంద‌మూరి వార‌సులు ఖచ్చితమైన పుట్టినరోజులు 1422 నంబర్ సిరీస్‌ను ఏర్పరుస్తాయి. అందుకే తార‌క్ త‌న బెంజ్ కి ఈ నెంబ‌ర్ తో రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇక‌పై ఇదే సిరీస్ కొన‌సాగిస్తాడా? లేక కేవ‌లం బెంజ్ వ‌రకే పరిమితం చేస్తాడా? అన్న‌ది చూడాలి. ఈ కారును తార‌క్ పిల్ల‌ల పేరు మీద అభిమానంగా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

వాళ్ల పుట్టిన రోజులు స్మ‌రించుకుంటూ నెంబ‌ర్ ఇచ్చారు కాబ‌ట్టి పిల్ల‌లిద్ద‌రికీ ఈ కారుతో ప్ర‌త్యేక‌మైన బాండింగ్ ఏర్ప‌డిన‌ట్లే. అదీ సంగ‌తి. ఇక తార‌క్ 'దేవ‌ర' షూట్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పాన్ ఇండియాలో ఈసినిమా సంచ‌ల‌న‌మ‌వుతుంద‌ని అభిమానులు బ‌లంగా విశ్వ‌శిస్తున్నారు. అక్టోబ‌ర్ లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.