హీరోయిన్‌ని అవమానించిన సెక్యూరిటీ గార్డ్!
మైదాన్ ప్రీమియర్ కోసం విచ్చేసిన `బిగ్ బాస్ 16` స్టార్ అర్చన గౌతమ్‌ను రెడ్ కార్పెట్‌పై సెక్యూరిటీ గార్డ్ ఆపారు.
By: Tupaki Desk | 10 April 2024 6:55 AM GMTఇది చాలా అరుదైన ఘటన. ఆమె ఫోటోగ్రాఫర్ల అభ్యర్థన మేరకు కెమెరాలకు ఫోజులిస్తోంది. ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా వారికి సహకరిస్తూ తన వినమ్రతను చాటుకుంటోంది. అనవసర భేషజం అనేది సదరు నటీమణిలో అస్సలు కనిపించలేదు. అక్కడ ఫోటో ఫ్లాష్‌లు మెరుస్తుంటే, ఇంతలోనే అక్కడికి ఒక గార్డ్ వచ్చింది.. ఆ నటిపై చేయి వేసి నడిపించింది. తనని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళుతున్నట్టే అనిపించింది చూసేవారికి. కానీ దీనివెనక అసలు కథ వేరే ఉంది. ఇంతకీ అసలేం జరిగిందో లోతుల్లోకి వెళితే..
మైదాన్ ప్రీమియర్ కోసం విచ్చేసిన `బిగ్ బాస్ 16` స్టార్ అర్చన గౌతమ్‌ను రెడ్ కార్పెట్‌పై సెక్యూరిటీ గార్డ్ ఆపారు. మైదాన్ నిన్న థియేటర్లలో విడుదలైంది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి, గజరాజ్ రావు తదితరులు నటించారు. విడుదలకు ఒక రోజు ముందు, మేకర్స్ బాలీవుడ్ కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా బోనీ కపూర్, జాన్వీ, షబానా అజ్మీ వరకు, అజయ్ దేవగన్ సహా మైదాన్ టీమ్ ఉత్సాహంగా ఈవెంట్లో పాల్గొన్నారు. బిగ్ బాస్ 16 ఫేమ్ అర్చన గౌతమ్ కూడా ప్రీమియర్‌లో కనిపించింది. కానీ సదరు నటిని ఓ సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో పరిస్థితి ఊహించని మలుపు తిరిగింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్టిల్ ఫోటోగ్రాఫర్లు ఈ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తనకు జరిగిన అవమానాన్ని హైలైట్ చేసారు. ఫోటోగ్రాఫర్లకు పోజులిస్తుండగా, ఒక మహిళా సెక్యూరిటీ గార్డు నటి వద్దకు వచ్చి తనను పక్కకు తప్పుకోవాలని అమర్యాదగా వ్యవహరించడం చూపరులను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో వేగంగా వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ల్లో ప్రతిస్పందనల మరిగించాయి. సెక్యూరిటీ గార్డు చర్యను నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి అర్చనను ఆహ్వానించలేదని కొందరు అనుకున్నారు... ఇంతలోనే ఒక నెటిజన్ ఆ నటీమణికి `ఆహ్వానం లేదా?` అని ప్రశ్నించారు. మరొకరు సదరు నటి గేటు క్రాష్ అయినట్లు కనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చేందుకు అర్చన ముందుకొచ్చింది. ఈవెంట్‌కు అవసరమైన ఎంట్రీ బ్యాండ్‌ను తీసుకురావడం ప్రమాదవశాత్తూ మరిచిపోవడంతో సెక్యూరిటీ రంగంలోకి దిగిందని వివరించింది. అయితే అర్చనను అలా బయటి వైపు నడిపించిన సెక్యూరిటీ గార్డ్ తనకు ఒక ట్యాగ్ ని అందజేసి, తిరిగి ఫోటోషూట్లకు సహకరించారు. అదీ సంగతి...
నిజానికి ఇలాంటి ముఖ్యమైన భారీ ఈవెంట్లలో ఐడీ కార్డులు, ట్యాగ్ లు తప్పనిసరి. అలా లేనప్పుడు సెక్యూరిటీ వారికి ఇబ్బంది. వారు కన్ఫ్యూజ్ అవుతారు. సెలబ్రిటీ ఎవరో, వీఐపీలు, సాధారణ వ్యక్తులు ఎవరో కూడా గుర్తు పట్టడం కష్టం.
మైదాన్ క్రీడా నేపథ్య చిత్రం. ఈ చిత్రాన్ని గౌరవనీయమైన కోచ్ , భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు మేనేజర్ అయిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం నుండి ప్రేరణ పొంది రూపొందించారు. సయ్యద్ అబ్దుల్ రహీమ్‌గా అజయ్ దేవగన్ నటించారు.