Begin typing your search above and press return to search.

సీడెడ్.. మెల్లగా మూడో స్థానంలోకి వచ్చిన పుష్ప 2

అయితే ఈ నెంబర్ ని 'పుష్ప 2' అధికమించి 32 కోట్లకి పైగా వసూళ్లని అందుకున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   27 Dec 2024 7:27 AM GMT
సీడెడ్.. మెల్లగా మూడో స్థానంలోకి వచ్చిన పుష్ప 2
X

'పుష్ప 2' మూవీ ప్రభంజనం 22వ రోజు కూడా కొనసాగుతోంది. క్రిస్మస్ హాలిడేస్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయనే మాట వినిపిస్తోంది. అన్ని చోట్ల డీసెంట్ వసూళ్లని అందుకుంటూ 1700 కోట్ల కలెక్షన్స్ ని ఇప్పటికే ఈ మూవీ క్రాస్ చేసింది. నాలుగో వారం లోకి కూడా దిగ్విజయంగా ఈ చిత్రం అడుగుపెట్టబోతోంది. శుక్ర, శని, ఆదివారాలు మరల ఈ మూవీకి మంచి వసూళ్లు వస్తాయని అనుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాలలో షేర్ పరంగా 'పుష్ప 2' మూవీ బాహుబలి 2 కలెక్షన్స్ ని క్రాస్ చేసి టాప్ 2లోకి వచ్చింది. గ్రాస్ వసూళ్ల పరంగా అయితే ఇంకా మూడో స్థానంలోనే ఉంది. ఇక హిందీలో నెవ్వర్ బిఫోర్ అనే స్థాయిలో ఎవ్వరికి సాధ్యం కానీ హైట్స్ లోకి ఈ మూవీ వెళ్లబోతోందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'బేబీ జాన్' కూడా 'పుష్ప 2' జోరుని ఆపలేకపోయింది.

ఇదిలా ఉంటే ఉంటే సీడెడ్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటేసి లాభాల బాటలోకి వచ్చేసింది. సీడెడ్ లో ఈ చిత్రంపై 30 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ కలెక్షన్స్ నెంబర్ ని 'పుష్ప 2' క్రాస్ చేసింది. ఇక తాజాగా సీడెడ్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాల జాబితాలో టాప్ 3లో ఉన్న 'దేవర'ని ఈ చిత్రం క్రాస్ చేసింది. 'దేవర' మూవీ 31.85 కోట్ల గ్రాస్ తో మొన్నటి వరకు టాప్ 3లో ఉండేది.

అయితే ఈ నెంబర్ ని 'పుష్ప 2' అధికమించి 32 కోట్లకి పైగా వసూళ్లని అందుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జోరు కొనసాగితే లాంగ్ రన్ లో సీడెడ్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఉన్న 'బాహుబలి 2' రికార్డ్ ని కూడా అధికమించే అవకాశం ఉంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో 34.75 కోట్ల వసూళ్లు చేసింది. మరో 3 కోట్లు వరకు 'పుష్ప 2' సినిమా సీడెడ్ లో కలెక్ట్ చేస్తే 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్ అవుతుంది.

ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ జోరు చూస్తుంటే ఈ నెంబర్ అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చని అనుకుంటున్నారు. ఇక సీడెడ్ లో ఏ మేరకు లాభాలు అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నైజాంలో కూడా పుష్ప 2 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది. వీకెండ్ కలెక్షన్లు పెరిగితే జెట్ స్పీడ్ లోనే ఈ రికార్డ్ ను అందుకునే అవకాశం ఉంటుంది.