సీడెడ్ టాప్ కలెక్షన్స్… పుష్ప 2 ఏ స్థానంలో అంటే?
ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర పార్ట్ 1' సినిమా 31.85 కోట్ల కలెక్షన్స్ తో టాప్ 3లో ఉంది. 'పుష్ప 2' మూవీ లాంగ్ రన్ లో 'దేవర పార్ట్ 1' కలెక్షన్స్ ని బీట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
By: Tupaki Desk | 21 Dec 2024 2:28 PM GMTతెలుగు రాష్ట్రాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ 200 కోట్ల షేర్ కలెక్షన్స్ క్లబ్ లో చేరింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 300 కోట్లు దాటింది. తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో ఈ చిత్రం టాప్ 3లో నిలించింది. ఇప్పటి వరకు 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి 2' సినిమాలు మాత్రమే తెలుగు రాష్ట్రాలలో 200 కోట్ల షేర్ దాటాయి. ఇప్పుడు 'పుష్ప 2' కూడా ఈ క్లబ్ లోకి చేరింది.
ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోవాలంటే మరో 14+ కోట్లకి పైగా వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. మూడో వారం వీకెండ్, క్రిస్మస్ హాలిడేస్ కలిసిరాకున్న నేపథ్యంలో ఈ నెంబర్ ని 'పుష్ప 2' అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే సీడెడ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాల జాబితాలో 'పుష్ప 2' నాలుగో స్థానంలో ఉంది. ఈ మూవీ ఇప్పటి వరకు సీడెడ్ లో 30.16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది.
దీని కంటే ముందు టాప్ 1 హైయెస్ట్ గ్రాసర్ గా 'ఆర్ఆర్ఆర్' ఉంది. ఈ చిత్రం 51.04 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంది. 'బాహుబలి 2' మూవీ 34.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 2లో నిలిచింది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర పార్ట్ 1' సినిమా 31.85 కోట్ల కలెక్షన్స్ తో టాప్ 3లో ఉంది. 'పుష్ప 2' మూవీ లాంగ్ రన్ లో 'దేవర పార్ట్ 1' కలెక్షన్స్ ని బీట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అలాగే 'బాహుబలి 2' కలెక్షన్స్ దగ్గరకి వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇక 'పుష్ప 2' తర్వాత టాప్ 5 హైయెస్ట్ గ్రాస్ మూవీగా 'సలార్ పార్ట్ 1' నిలిచింది. ఈ చిత్రం లాంగ్ రన్ లో 22.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సీడెడ్ లో వసూళ్లు చేసింది. తరువాత వరుసగా 'బాహుబలి', 'కల్కి 2898ఏడీ', 'సైరా', 'వాల్తేరు వీరయ్య', 'అల వైకుంఠపురములో' సినిమాలు ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్ – 51.04CR
బాహుబలి 2 - 34.75CR
దేవర పార్ట్ 1 – 31.85CR
పుష్ప 2 ది రూల్ - 30.16CR***
సలార్ పార్ట్ 1 - 22.75CR
బాహుబలి - 21.8CR
కల్కి 2898ఏడీ – 21.80CR
సైరా - 19.11Cr
వాల్తేరు వీరయ్య - 18.35Cr
అల వైకుంఠపురంలో - 18.27Cr