ఆమె కారణంగానే అగ్రనిర్మాత విడాకులు?
ఇప్పుడు శివాని పౌతో ఇటీవలి ఇంటర్వ్యూలో సీమా.. సోహైల్‌తో విడాకుల గురించి అనేక పుకార్లు సహా తన జీవితంలోని అనేక రహస్యాలను షేర్ చేసారు.
By: Tupaki Desk | 3 Nov 2023 4:43 AM GMTబాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ సోదరులిద్దరూ విడాకుల బాట పట్టిన సంవత్సరాల తర్వాతా దీనిపై మీడియా సహా అభిమానుల్లో చర్చ సాగుతూనే ఉంది. ముఖ్యంగా బిగ్ బ్రదర్ సోహైల్ ఖాన్ అతడి భార్య సీమా సజ్దే వివాహం అయ్యి 24 సంవత్సరాల తర్వాత విడిపోవడం దేశవ్యాప్తంగా షాక్‌వేవ్‌లను పంపింది. నిర్వాణ -యోహాన్ అనే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయిన ఈ జంట గత సంవత్సరం విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు శివాని పౌతో ఇటీవలి ఇంటర్వ్యూలో సీమా.. సోహైల్‌తో విడాకుల గురించి అనేక పుకార్లు సహా తన జీవితంలోని అనేక రహస్యాలను షేర్ చేసారు.
సీమా అధునాతన ఆలోచనల నుంచి తన భాష్యం ఇలా ఉంది. "నా తండ్రి కాలం నాటి ఆలోచనల పాఠశాల వేరు. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో విడాకులకు కళంకం ఉంది. ఇప్పుడు మనం సోషల్ మీడియా యుగంలో జీవిస్తున్నాం కాబట్టి నేను వ్యక్తుల గురించి ఇలా చెబుతాను. "ఓహ్ ఆమె అతడిని ఆ కుటుంబాన్ని తనకు అవసరమైనంత కాలం ఉపయోగించుకుంది. ఆమె ఎక్కడికి వెళ్లాలనుకుందో అక్కడకు వెళ్లింది. ఇప్పుడు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంది" అని ఆలోచించాలి అని సజ్దే అన్నారు. ఇంటర్వ్యూలో సీమా ఇంకా చాలా షాకింగ్ వివరాలను వెల్లడించారు. సోహైల్ నుంచి ఆమె చాలా సంవత్సరాల క్రితమే విడిపోయానని, కానీ ప్రపంచం మేం కలిసి ఉన్నామని భావించిందని తెలిపారు.
నేను అతనిని ఎందుకు నిందించాలి? విడాకులు మా ఇద్దరికీ సరిపోతుంది. మా అబ్బాయి నిర్వాణ్ ఆ వయస్సులో ఉన్నాడు. అతడు దానిని కోరుకోలేదు.. కాని నా పెళ్లి .. నా కొడుకు ఏది ముఖ్యం? అనే ప్రశ్న రాగానే నేను ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. నా కొడుకు నేను చాలా భయపడే దారిలో వెళ్తున్నాడు. ఒక రోజు ఉదయం నేను మేల్కొన్నాను. నేను ఈ వివాహాన్ని కాపాడుకోవడంపై నా శక్తులన్నింటినీ కేంద్రీకరిస్తాను.. లేదా నా కొడుకుపైనే శ్రద్ధ పెడతాను అని గ్రహించాను. అప్పుడే నేను నిర్ణయించుకుని నా కొడుకుతోనే జీవితం అని ఎన్నుకున్నాను.. అని తెలిపారు.
సీమా - సోహైల్‌ల విడాకుల కథనాలు ప్రధాన స్రవంతిలోకి వచ్చినప్పుడు ఒక కొత్త పుకారు పుట్టుకొచ్చింది. ఈ జంట కాపురంలోకి 'కొందరు ఇతర మహిళల ప్రమేయం' కారణంగా విడాకులు తీసుకుంటున్నారని కథనాలొచ్చాయి. దానిపై ప్రస్తావిస్తూ సీమా వివరణ ఇచ్చారు. "కొందరు అన్ని రకాల విషయాలు చెబుతారు. ఇతర మహిళల వల్ల నేను అనుభవించాను. అయినా అది చాలా సాధారణమైనది. కానీ చివరికి ఏం చేయాలో నేను ఎంచుకున్నాను. ఇద్దరు వ్యక్తులు కలిసి సంతోషంగా లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నిరంతరం గొడవలు జరుగుతున్నప్పుడు, పతనమయ్యేది ఎల్లప్పుడూ పిల్లలే. జీవితంలోని ఆ దశలో సమయం చాలా త్వరగా గడిచిపోతుందని, పిల్లలు త్వరగా పెరుగుతారని గ్రహించలేం. మీరు అక్కడ (పిల్లలపై) నష్టం చేసినప్పుడు మీకు తెలియదు. పిల్లలకు ఇది ఎంతో పెద్ద నష్టం.. కానీ తప్పదు" అని కూడా సీమా అన్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సోహైల్ ప్రస్తుతం బిగ్ బాస్ 17లో ఒక సీక్వెన్స్‌ని హోస్ట్ చేస్తున్నాడు. సీమా బాలీవుడ్ వైవ్స్ - ఫ్యాబులస్ లైవ్స్‌లో నటించింది.