Begin typing your search above and press return to search.

హీరోయిన్‌కి ప్రియుడు కావలెనట..!

ఈ వాలెంటైన్స్ డే ప్లాన్ ఏంటి అని ప్రశ్నించిన సమయంలో సరదా సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

By:  Tupaki Desk   |   10 Feb 2025 8:18 AM GMT
హీరోయిన్‌కి ప్రియుడు కావలెనట..!
X

పదేళ్ల క్రితం రన్‌ రాజా రన్‌ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌. బాలీవుడ్‌కి చెందిన ఈ అమ్మడు టాలీవుడ్‌లో మొదట్లో వరుసగా సినిమాల్లో నటించింది. కపూర్‌ బ్యూటీ అనే ట్యాగ్‌తో టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేక పోవడంతో ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా రెగ్యులర్‌గా వార్తల్లో నిలిచే సీరత్‌ కపూర్‌ అడపా దడపా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు హైదరాబాద్‌లో సందడి చేసింది.

కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో వచ్చిన 'కృష్ణ అండ్‌ హీజ్‌ లీల' సినిమాను థియేట్రికల్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేశారు. త్వరలో 'ఇట్స్ కాంప్లికేటెడ్‌' అనే టైటిల్‌తో థియేటర్‌ల ద్వారా రాబోతున్న సినిమా ప్రమోషన్‌ కోసం సీరత్‌ కపూర్ మీడియా ముందుకు వచ్చింది. సిద్దు జొన్నలగడ్డకు జోడీగా సీరత్‌ కపూర్‌ ఆ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. సినిమాను థియేటర్‌లో చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సీరత్‌ కపూర్‌ చెప్పుకొచ్చింది. అదే సమయంలో మీడియా వారు.. ఈ వాలెంటైన్స్ డే ప్లాన్ ఏంటి అని ప్రశ్నించిన సమయంలో సరదా సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

వాలంటైన్స్ డే ప్లాన్స్ ఏం లేవని, ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నాను. మింగిల్‌ కావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. వాలంటైన్స్‌ డే రోజు ఎవరైనా రోజా ఫ్లవర్‌ ఇస్తే తీసుకోవడానికి రెడీ అన్నట్లు చెప్పుకొచ్చింది. సింగిల్‌గా ఉన్న సీరత్‌ కపూర్‌ వచ్చే వాలంటైన్స్ డే వరకు అయినా మింగిల్ కావాలని కోరుకుంటున్నాం అంటూ సోషల్‌ మీడియా ద్వారా చాలా మంది ఆమె అభిమానులతో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్స్‌ లో ఎక్కువ శాతం మంది సింగిల్‌గా ఉండరు. రహస్య ప్రేమాయణం సాగిస్తూ ఉంటారు. కానీ సీరత్‌ కపూర్‌ మాత్రం సింగిల్‌ అని క్లీయర్‌గా చెప్పేసింది.

సినిమా ఇండస్ట్రీలో మొదట అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. నటిగా, మోడల్‌గా, డాన్సర్‌గా ఎన్నో రకాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సీరత్‌ కపూర్‌ బాంద్రాలోని నేషనల్‌ కాలేజీలో ప్రీ యూనివర్శిటీ కోర్సును పూర్తి చేసింది. మాస్‌ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలని అనుకుంది. కానీ నటనలో బిజీ కావడంతో డిగ్రీని మధ్యలోనే వదిలేసింది. ఎప్పటికైనా తన డిగ్రీని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో సీరత్‌ కపూర్ చెప్పుకొచ్చింది. 16 ఏళ్ల వయసులో బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ ఆష్లే లోబో, ది డాన్స్‌ వర్క్స్‌ వద్ద డాన్సర్‌గా జాయిన్ అయ్యింది. కపూర్‌ డాన్స్ అకాడమీలోనూ ట్రైనర్‌గా సీరత్ కపూర్‌ కొన్నాళ్లు చేసింది. రాక్ స్టార్‌ సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేయడంతో సీతర్‌ కపూర్‌ దశ తిరిగింది.