Begin typing your search above and press return to search.

సీరత్ కపూర్.. సింపుల్ లుక్ లోనే యమ ఘాటుగా..

ఆమె అందచందాలు, గ్లామర్ లుక్స్ అభిమానులను ఆకర్షిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   1 Aug 2024 6:08 AM GMT
సీరత్ కపూర్.. సింపుల్ లుక్ లోనే యమ ఘాటుగా..
X

టాలీవుడ్‌లో ‘రన్ రాజా రన్’ సినిమాతో అరంగేట్రం చేసిన సీరత్ కపూర్, మొదటి సినిమా నుంచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, 'భామా కలాపం' చిత్రం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. కానీ, ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడం వల్ల అందరి దృష్టిలో పడలేదు. ప్రస్తుతం సీరత్ కెరీర్ పరంగా కొత్త అవకాశాల కోసం కృషి చేస్తోంది.

అయితే, ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. బాలీవుడ్‌లో కూడా అదృష్టాన్ని పరీక్షించిన సీరత్, అటువైపు రెండు సినిమాల్లో నటించినా, పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలో, ఆమె కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నా, ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల నుంచి సీరియస్ పోటీని ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడుతుంది.

అయితే, సినిమాల్లో బిజీగా లేకపోయినా, సీరత్ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటోంది. తరచుగా తన ఫోటోలను షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌తో ఎక్కడికప్పుడు కనెక్ట్ అవుతోంది. సీరత్ షేర్ చేసిన ప్రతి ఫోటో యువతలో చర్చకు దారితీస్తోంది. ఇటీవలే అమ్మడు ఎల్లో డ్రెస్ ల్ దిగిన ఒక ఫొటో షేర్ చేసి అభిమానులను మంత్ర ముగ్దులను చేసింది. ఆమె అందచందాలు, గ్లామర్ లుక్స్ అభిమానులను ఆకర్షిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న అమ్మడు రాబోయే రోజుల్లో మరింత గ్లామరస్ గా పాత్రలు చేయనున్నట్లు ఒక హింట్ అయితే ఇచ్చేసింది. కెరీర్ ఎలా ఉన్నా కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో మాత్రం అమ్మడు హాట్ టాపిక్ గా మారితూనే ఉంది .సీరత్ కెరీర్ లో పాజిటివ్ టర్నింగ్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ, తన అందంతో అభిమానుల దృష్టిని మాత్రం నిలబెట్టుకోవడం జరిగింది.

కొత్త అవకాశాలు దొరికే వరకు సోషల్ మీడియాలో ఆమె పాపులారిటీ మాత్రం తగ్గదనిపిస్తోంది. ఇక ఆ మధ్య ఒక మీడియం రేంజ్ హీరోతో ఛాన్స్ దక్కినట్లు టాక్ వచ్చినా ఆమె నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక మధ్యలో వెబ్ సీరీస్ లు కూడా చేసింది. స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తానని చెప్పింది. మరి గ్లామర్ తో ఇంతలా ఆకట్టుకుంటున్న అమ్మడు రాబోయే రోజుల్లో ఎలాంటి ఛాన్సులు అందుకుంటుందో చూడాలి.