సముద్రంలో ఓ అందమైన ముత్యపు బొట్టులా!
తాజాగా బ్యూటీ డిజైనర్ ఔట్ ఫిట్ లో ఆహా అనిపించింది. అందమైన బౌలులో వికసించిన బుట్టబొమ్మనే తలపించింది.
By: Tupaki Desk | 26 July 2024 5:52 AM GMTటాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చింది ముంబై బ్యూటీ సీరత్ కపూర్. తొలి సినిమా సక్సెస్ తోనే అమ్మడి ఎనర్జిని జనాలకి ఎక్కించింది. దీంతో వరుసగా ఐదారు సినిమాలు చేసింది. కానీ ఫలితాలు నిరాశ పరచడంతో వేగం తగ్గింది. గత మూడేళ్లగా సినిమా ఛాన్సులే రాలేదు. ఇటీవలే శర్వాంనంద్ హీరోగా నటించిన 'మనమే' సినిమాలో మెరిసింది. ఆ సినిమా హిట్ అయితే మరోఛాన్స్ ఉండేదిగానీ ఇప్పుడా ఛాన్స్ కనిపించలేదు.
ప్రస్తుతానికి తెలుగులో ఛాన్సుల కోసం ఎదురు చూస్తొంది. అయినా ఇన్ స్టాలో సీరత్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే జోష్ తో నెట్టింట హల్చల్ చేస్తుంది. కొత్త ఫోటోలతో కుర్రాళ్లను హీటెక్కిస్తుంది.
ముంబై బ్యూటీ తనలో మోడ్రన్ యాంగిల్ ని ఛాన్స్ దొరికనప్పుడల్లా ఎలివేట్ చేస్తుంది. తాజాగా బ్యూటీ డిజైనర్ ఔట్ ఫిట్ లో ఆహా అనిపించింది. అందమైన బౌలులో వికసించిన బుట్టబొమ్మనే తలపించింది.
వెండి కలర్ డిజైన్ ఔట్ ఫిట్ లో సీరత్ మెరిసిన వైనం వావ్ అనిపిస్తుంది. హిప్ టూ బాటమ్ డిజైన్.. మ్యాచిం గ్ నెక్ అండ్ టాప్ ని కవర్ చేస్తూ తయారు చేసిన బ్లౌజులో మరింత అందంగా హైలైట్ అవుతుంది. అమ్మడి నటుడు అందమైన కుండ మాదిరి హైలైట్ అవుతుంది. ఇక సీరత్ హెయిర్ స్టైల్ రెగ్యులర్ భిన్నంగా సంథింగ్ స్పెషల్ గా నిలిచింది. రింగు రింగుల జుత్తు.. మ్యాకప్...ఐబ్రోస్..ఐస్ ప్రతీది సీరత్ ని మరింత అందంగా తీర్చిదిద్దాయి.
బ్లూ బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ ఎంతో అందంగా హైలైట్ అవుతుంది. తనని తాను సముద్రంలో ఓ ముత్యపు బొట్టుగా వర్ణించుకుంది. ఎగసిపడుతోన్న కెరటం ఎమోజీని జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సీరత్ అభిమానులు ఆమె లో బ్యూటీకి ఫిదా అవుతున్నారు. అలాగే సీరత్ క్యాప్షన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. తనని తాను పడి లేస్తున్న కెరటంలా సింబాలిక్ గా చెప్పే ప్రయత్నం చేసింది.